తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండవ జాబితా వచ్చేసింది
x

తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండవ జాబితా వచ్చేసింది

కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ పార్టీ లోక్ సభ అభ్యర్థుల రెండవ జాబితాను ఖరారు చేసింది. 57 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను గురువారం రాత్రి ఏఐసీసీ ప్రకటించింది.


కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ పార్టీ లోక్ సభ అభ్యర్థుల రెండవ జాబితాను ఖరారు చేసింది. 57 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను గురువారం రాత్రి ఏఐసీసీ ప్రకటించింది. ఈ జాబితాలో తెలంగాణలోని ఐదు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. రెండు ఎస్సీ స్థానాలకు, మూడు జనరల్ స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసింది. పెద్దపల్లి, మల్కాజిగిరి, సికింద్రాబాద్, నాగర్ కర్నూల్, చేవెళ్ల స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. వీరిలో ముగ్గురు బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన వారే కావడం విశేషం.


తెలంగాణ అభ్యర్థుల జాబితా..

పెద్దపల్లి (ఎస్సీ) - గడ్డం వంశీ కృష్ణ

మల్కాజిగిరి - పట్నం సునీతా మహేందర్ రెడ్డి

సికింద్రాబాద్ - దానం నాగేందర్

నాగర్ కర్నూల్ (ఎస్సీ) - మల్లు రవి

చేవెళ్ల - ఎంపీ రంజిత్ రెడ్డి


Read More
Next Story