Food Poison | ఫుడ్ పాయిజన్‌పై ఫుల్ ఫోకస్.. కొత్త నిబంధనలకు శ్రీకారం..
x

Food Poison | ఫుడ్ పాయిజన్‌పై ఫుల్ ఫోకస్.. కొత్త నిబంధనలకు శ్రీకారం..

విద్యా సంస్థల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్(Food Poison) ఘటనలపై తెలంగాణ సీఎస్ శాంతకుమారి(Santhakumari) కీలక ఉత్తర్వులు జారీ చేశారు. విద్యా సంస్థల్లో సరికొత్త నిబంధనలకు శ్రీకారం చుట్టారు.


తెలంగాణ వ్యాప్తంగా వరుస ఫుడ్ పాయిజన్(Food Poison) ఘటనలు సంభవించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పాఠశాలలు, అంగన్వాడీలు, గురుకులాలు, వసతిగృహాల్లో పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించేలా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే సీఎస్ శాంతకుమారి(Santhakumari).. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతిరోజూ రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట ఆహారం వికటించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిల్లల జీవితాలంటే లెక్కలేదా అంటూ అధికారులపై మండిపడింది. విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలని, వారికి వడ్డించే ఆహారం విషయంలో నాణ్యత లోపించకుండా అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఈ విషయంలో తుది నిర్ణయం కేవలం పాఠశాల యాజమాన్యాలకే వదిలేది లేదని, ఎప్పటికప్పుడు పాఠశాలల్లో ఆహార నాణ్యతను తనిఖీ చేయడానికి ప్రత్యేక కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఇందులో బాగంగానే పాఠశాలల్లో అందించే ఆహార నాణ్యతను తనిఖీ చేయడం కోసం ప్రత్యేక ఫుడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ కమిటీ విద్యా సంస్థల్లో అందించే ఆహార పదార్థాల నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. ఏమాత్రం తేడా కనిపించినా వెంటనే చర్యలు చేపడుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఈ కమిటీల్లో స్కూల్ హెడ్ మాస్టర్, గురుకులాల్లో అయితే వార్డెన్‌తో పాటు మరో ఇద్దరు ఉంటారు. వీరు ప్రతి రోజూ విద్యార్థులకు పెట్టే భోజనం తయారీకి ముందు వంటశాలను, ముడి సరుకులను తనిఖీ చేస్తారు. వాటికి సంబంధించి పూర్తి సమాచారం తీసుకుంటారు. అదే విధంగా వంటలు పూర్తయిన తర్వాత వంటలను వారు ముందుగా రుచి చూసి నాణ్యత విషయంలో ఒక నిర్ధారణకు వస్తారు. ఈ కమిటీ సభ్యులు భోజనం చేసి.. ఆహారం నాణ్యంగానే ఉందని రూఢీ చేసుకున్న తర్వాతనే విద్యార్థులకు వడ్డించాలని ప్రభుత్వ నిశ్చయించింది. ఈ మేరకు సీఎస్ శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

దాంతో పాటుగానే విద్యా సంస్థల స్థాయిలో ఆహార పదార్థల నాణ్యతను తనిఖీ చేసే ఈ త్రీమెన్ ఫుడ్ సేఫ్టీ కమిటీ.. ప్రతి రోజూ కూడా వండిన ఆహార పదార్థాలను, వంటగది పరిసరాలను, స్టోర్ రూమ్‌ను పరిశీలించారు. వంట పూర్తయిన తర్వాత వండిన ప్రతి వంటకం ఫొటోలను తీసి ఉన్నతాధికారులకు పంపాల్సి ఉంటుంది. పాఠశాలల్లో ఆహార ఏర్పాట్లు తదితర అంశాలపై సంబంధిత అధికారులు కచ్ఛితంగా రోజూ తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోబడతాయిన శాంతకుమారి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

దీంతో పాటుగానే విద్యా సంస్థల్లో ఫుడ్ పాయిజన్ కాకుండా చూసుకోవడం కోసం ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఇందులో ఫుడ్ సేఫ్టీ కమిషనర్, అదనపు డైరెక్టర్, జిల్లా స్థాయి అధికారి ఉంటారు. ఈ బృందాలు అన్ని విద్యా సంస్థలు, ఆసుపత్రులు, వసతిగృహాలు, అంగన్వాడీల్లో ఆహార నాణ్యతను పర్యవేక్షిస్తుంది. ఎక్కడైనా, ఎప్పుడైనా ఫుడ్ పాయిజన్ జరిగినట్లు తేలితే వెంటనే అక్కడకు చేరుకుని అందుకు గల కారణాలను కనుగొంటుంది. అంతేకాకుండా బాధ్యులకు శిక్ష పడేలా చర్యలు చేపడుతుందని కలెక్టర్లకు జారీ చేసిన ఆదేశాల్లో సీఎస్ శాంతకుమారి తెలిపారు.

Read More
Next Story