తెలంగాణ ఆదాయం తగ్గడానికి కాంగ్రెస్ హామీలే కారణమా..!
x

తెలంగాణ ఆదాయం తగ్గడానికి కాంగ్రెస్ హామీలే కారణమా..!


తెలంగాణ రాష్ట్ర ఆదాయం తగ్గిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. తాను ఈ మాటలు గాలికి చెప్పడం లేదని, కాగ్ త్రైమాసిక నివేదిక ఆధారంగా చెప్తున్నాని అన్నారు. దీనిని ఆయన ఒక డేంజర్ బెల్‌గా అభివర్ణించారు. దీనికి ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనమే కారణమని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతోనే తెలంగాణ ఆర్థిక రంగం దెబ్బతింటోందని, ఇందులో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీల సింహభాగం పాత్ర పోషించాయని ఆరోపించారు కేటీఆర్. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలే 60శాతం నష్టం చేశాయని విమర్శలు గుప్పించారు. ‘‘ఒకవైపు రాష్ట్ర ఆదాయం తగ్గుంటే.. మరోవైపు అప్పులు మాత్రం కుప్పలు తెప్పలుగా పెరుగుతున్నాయి’’ అని అన్నారు కేటీఆర్.

‘‘రూ.2,738 కోట్ల మిగులు ఉంటుందని బడ్జెట్లో చూపారు. మొదటి త్రూమాసికం ముగిసేనాటికి రూ.10,583 కోట్ల రెవెన్యూ లోటు వచ్చింది. మూడు నెలల్లోనే రూ.20,266 కోట్లు అప్పుగా తీసుకున్నారు. ఒక్క రోడ్డు వేయలేదు. ఒక్క కొత్త ప్రాజెక్ట్ కట్టలేదు. ఆర్థిక రంగాన్ని ఎలా గాడిన పెడతారో కాంగ్రెస్ ఆర్థిక నిపుణులు చెప్పగలరా?’’ అని ప్రశ్నించారు.

Read More
Next Story