పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది !
x

పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది !

మూడు విడతల్లో జరగనున్న పోలింగ్. మంగళవారం నుంచి ఎలక్షన్ కోడ్ అమలు.


తెలంగాణ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషర్ రాణి కుముదిని విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ జరగనుంది. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యామ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. అవే మూడు రోజుల పాటు మధ్యాహ్నం 2 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచే ఎన్నికల కోడ్ అమలయిందని ఆమె వెల్లడించారు.

గురువారం అంటే నవంబర్ 27న తొలి విడత పోలింగ్‌కు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. నవంబర్ 30న రెండో విడత, డిసెంబర్ 3న మూడో విడత నామినేషన్లను స్వీకరించనున్నారు. ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు कि, సెప్టెంబర్ 29న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తరువాత కొన్ని కారణాల వల్ల అక్టోబర్ 9న ఆ షెడ్యూల్‌పై స్టే విధించబడిందని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 1.66 కోట్ల గ్రామీణ ఓటర్లు ఉన్నారని చెప్పారు. మొదటి దశలో 4,236 సర్పంచ్ పదవులకు, అలాగే 37,440 వార్డులకు ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. రెండో విడతలో 4,333 సర్పంచ్‌ స్థానాలు, 38,350 వార్డులకు పోలింగ్ జరగనుండగా.. మూడో విడతలో 4,159 సర్పంచ్‌ స్థానాలు, 36,452 వార్డులకు పోలింగ్‌ నిర్వహించనున్నారు.

Read More
Next Story