
ఎసిబి సోదాల్లో పట్టుబడ్డ తెలంగాణ ఇంజినీర్
కొడకండ్ల స్కూల్ భవనం బిల్లుల కోసం ముడుపులు స్వీకరించిన రమేష్
తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) అధికారులు గురువారం జరిపిన దాడుల్లో తెలంగాణ ఇంజినీర్ చిక్కాడు. హనుమకొండ వెల్పేర్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ విభాగంపై జరిపిన ఎసిబి సోదాల్లో అసిస్టెంట్ ఇంజినీర్ రమేష్ పట్టుబడ్డాడు. కొడకండ్ల స్కూల్ భవనం బిల్లుల మంజూరు కోసం రమేష్ రూ.18 వేలు లంచం అడిగాడు. గతంలో పదివేలు ముడుపులు స్వీకరించిన రమేష్ పై ఎసిబి అధికారులకు ఫిర్యాదు అందింది. మిగతా 8 వేల రూపాయల కోసం రమేష్ హనుమకొండ వెల్పేర్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో వెయిట్ చేస్తున్నాడు. బాధితుల నుంచి ఎనిమిదివేలరూపాయలు స్వీకరించగానే ఎసిబి అధికారులు ఎంతో చాకచక్యంగా వలపన్ని నిందితుడిని అరెస్ట్ చేశారు. రమేష్ ప్రస్తుతం జనగామ డిఈవో ఆఫీసులో పని చేస్తున్నాడు.
Next Story