దిల్‌సుఖ్‌నగర్లో ఈ రెస్టారెంట్ వంటలో వాడే నీళ్లు మంచివేనా?
x

దిల్‌సుఖ్‌నగర్లో ఈ రెస్టారెంట్ వంటలో వాడే నీళ్లు మంచివేనా?

తెలంగాణ ఆహార భద్రత కమిషన్ కు చెందిన టాస్క్‌ఫోర్స్ బృందాలు పలు హోటళ్లు, రెస్టారెంట్లపైన దాడులు కొనసాగిస్తున్నాయి.


తెలంగాణ ఆహార భద్రత కమిషన్ కు చెందిన టాస్క్‌ఫోర్స్ బృందాలు పలు హోటళ్లు, రెస్టారెంట్లపైన దాడులు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఆగస్టు 31న హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలోని పలు రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించి అనేక పరిశుభ్రత ఉల్లంఘనలను గుర్తించాయి.

స్థానికంగా ఉన్న ఫేమస్ పాపడమ్స్ బ్లూ రెస్టారెంట్ అండ్ బాంక్వెట్ హాల్‌ ఉల్లంఘనలకు పాల్పడినట్టు గుర్తించారు. ఫుడ్ హ్యాండ్లర్ల కి మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు అందుబాటులో లేవని తేల్చారు. ఆహార తయారీలో ఉపయోగించే RO నీటికి సంబంధించిన వాటర్ అనాలసిస్ రిపోర్టులు లేకపోవడంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లోరింగ్ తడిగా, జారుతూ ఉండటంపై మండిపడ్డారు. డస్ట్‌బిన్‌ల పై మూతలు లేకపోవడాన్ని ప్రశ్నించారు.

రిఫ్రిజిరేటర్‌లోని ఆహార పదార్థాలకు సరైన లేబుల్ లేదు. గడువు ముగిసిన ఫ్లేవర్ ఏజెంట్లు, ఫ్రూట్ ఫిల్లింగ్స్, సింథటిక్ ఫుడ్ కలర్‌ల వాడకాన్ని అధికారులు గుర్తించారు. వంటగదిలో బొద్దింకలు తిరుగుతున్నాయని, ఫుడ్ హ్యాండ్లర్లు అప్రాన్లు, గ్లౌజులు ధరించలేదని సీరియస్ అయ్యారు. అంతేకాదు, పాపడమ్స్ బ్లూ రెస్టారెంట్ సాధారణ తయారీ వర్గానికి తగిన FSSAI లైసెన్స్‌ను పొందలేదు, అయినప్పటికీ ఈ ప్రాంగణాన్ని ఐదు వేర్వేరు శాఖలకు కేంద్ర వంటగదిగా ఉపయోగిస్తున్నారని ఫుడ్ సేఫ్టీ అధికారులు తేల్చారు.

Read More
Next Story