హైదరాబాద్ లో ఈ రెస్టారెంట్స్ లో ఫుడ్ తింటే అంతే సంగతులు!!
హైదరాబాద్ లక్డీకాపుల్, సోమాజిగూడ పరిధిలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి.
గత వారం రోజులుగా తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలు నగరంలోని పలు రెస్టారెంట్లు, కేఫ్ లు, బేకరీలలో తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే హైదరాబాద్ లోని ప్రముఖ హోటల్స్ లో పాడైపోయిన ఆహార పదార్థాలు వాడటమే కాకుంటే ఫుడ్ సేఫ్టీ రూల్స్ కూడా సరిగా పాటించడం లేదని వెల్లడైంది. ఏయే ఫుడ్ సెంటర్లలో నిబంధనలు ఉల్లంఘించారో తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో వివరాలు వెల్లడించారు. దాడుల అనంతరం ఫుడ్ సేఫ్టీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలు ఆహార నిబంధనలు పాటించని జాబితాలో ఉన్న కొన్ని ప్రముఖ రెస్టారెంట్స్ పేర్లు విడుదల చేశారు.
- క్రీమ్ స్టోన్
- న్యాచురల్స్ ఐస్ క్రీమ్
- కరాచీ బేకరీ
- కేఎఫ్సీ
- రోస్టరీ కాఫీ హౌస్
- రాయలసీమ రుచులు
- షా గౌస్
- కామత్ హోటల్
- 36 డౌన్ టౌన్ బ్రూ పబ్
- మాకౌ కిచెన్ అండ్ బార్
- ఎయిర్ లైవ్
- టాకో బెల్
- అహా దక్షిణ్
- సిజ్జిలింగ్ జో
- ఖాన్ సాబ్
- హోటల్ సుఖ్ సాగర్
- జంబో కింగ్ బర్గర్స్
- రత్నదీప్ స్టోర్
- కృతుంగ పాలెగార్స్ క్విజిన్ రెస్టారెంట్
- రెస్ట్ ఓ బార్
* Food handlers found without wearing any haircaps, gloves, aprons and medical fitness certificates.
— Commissioner of Food Safety, Telangana (@cfs_telangana) May 22, 2024
* FSSAI License not updated to new management.
* Damaged refridgerator, no distinct separation of kitchen area from outside environment.
(4/4)