కోలాహలంగా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల ప్రదానం
x
అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడి అవార్డును అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

కోలాహలంగా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల ప్రదానం

పదేళ్ల విరామం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో గద్దర్ ఫిలిం అవార్డుల ప్రదానోత్సవం వేడుకగా జరిగింది.


తెలంగాణ సినీలాకాశంలో ఉత్తమ ప్రతిభ చూపించిన కళాకారులకు గద్దర్ అవార్డులు ఇచ్చి గౌరవించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ హాలులో శనివారం రాత్రి తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం కనుల పండువగా జరిగింది. కనకాల సుమ,శ్రీముఖి యాంకర్లుగా వ్యవహరించారు. మొదట సంప్రదాయ నృత్యంతో, పేరిణి నృత్యంతో గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం ఆరంభమైంది. ఒకవైపు అవార్డుల ప్రదానోత్సవం మధ్యలో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు.తెలంగాణ గద్దర్ సినీ అవార్డుల ఉత్సవాన్ని జ్యోతి ప్రజ్వలన తో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రారంభించారు. మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు, ఎండీ హరీష్.తెలంగాణ గద్దర్ సినీ అవార్డులపై ప్రత్యేక సావనీర్ ను ఆవిష్కరించారు. అవార్డులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి అందజేశారు.



సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు ఎల్లప్పుడు చర్యలు తీసుకుంటుందని సీఎం ఎ రేవంత్ రెడ్డి చెప్పారు. నంది అవార్డులను ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దని సీఎం చేప్పారు. 14 సంవత్సరాల క్రితం ఆగిపోయిన నంది అవార్డులను తాము ఇచ్చామని సీఎం చెప్పారు. సినీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం మద్ధతు ఇస్తామని చెప్పారు. భారతీయ సినీ పరిశ్రమ అంటే హైదరాబాద్ వేదిక అని సీఎం చెప్పారు. సినిమా రంగంలో నాల్గవ తరం వచ్చిందని సీఎం చెప్పారు.






తాను కాలేజీ రోజుల నుంచి తనకు సినీపరిశ్రమలోని వారు తెలుసునని రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సినీపరిశ్రమను నూటికి నూరుపాట్లు సహకారం అందిస్తుందని సీఎం చెప్పారు. తెలంగాణ రైజింగ్ 2047 పేరిట సినీ, ఫార్మా, ఐటీ, పరిశ్రమల రంగం అభివృద్ధి చెందాలని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో సినీ పరిశ్రమను కేంద్రంగా చేయాలని సీఎం కోరారు. సినీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చెప్పారు. తెలంగాణ రైజింగ్ 2047లో సినీ పరిశ్రమకు విజన్ డాక్యుమెంటులో చాఫ్టరు ఇస్తామని ప్రకటించారు.తాను విదేశాలతో పోటీ పడుతూ అభివృద్ధి చేస్తున్నానని చెప్పారు. 2047 కు తెలంగాణ త్రీ బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ కు కూడా అవార్డు ఇవ్వాలని సీఎం కోరారు.




ప్రధాన అవార్డులను ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

రజాకార్ సినిమాకు స్పెషల్ జ్యూరీ అవార్డును, దుల్కర్ సల్మాన్ కు సీఎం రేవంత్ రెడ్డి అవార్డులను ప్రదానం చేశారు. స్పెషల్ జ్యూరీ అవార్డులను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంతో కలిసి అందించారు.ఉత్తమనటుడి అవార్డు ను అల్లు అర్జున్ కు, ఎన్టీఆర్ అవార్డును నందమూరి బాలకృష్ణకు,పైడి జయరాజ్ ఫిలిం అవార్డు, ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ : మణిరత్నం, బీఎన్ రెడ్డి ఫిలిం అవార్డు తెలుగు ఫిలిం డైరెక్టర్ : సుకుమార్ ,నాగిరెడ్డి, చక్రపాణి ఫిలిం అవార్డు తెలుగు నిర్మాత అట్లూరి పూర్ణ చంద్రరావు,కాంతారావు ఫిలిం అవార్డు తెలుగు ఆర్టీస్టు : విజయ దేవరకొండ , రఘుపతి వెంకయ్య ఫిలిం అవార్డు : యండమూరి వీరేంద్రనాథ్ లకు సీఎం ప్రదానం చేశారు.



ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి కొంత ఆలస్యంగా వచ్చి ముందు వరుసలో కూర్చుకున్నారు. సీఎం రేవంత్ తోపాటు సినీ హీరోలు నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్, సినీ నటీమణులు జయప్రద, జయసుధ, సుహాసిని, మణిరత్నం, దర్శకులు రాజమౌళిలు పాల్గొన్నారు.




ముగ్గురు సినీతారలతో అవార్డుల ప్రదానం

ముగ్గురు సినీతారలతో అవార్డుల ప్రదానం చేయించారు. జయసుధ, జయప్రద, సుహాసిని పలు అవార్డులను విజేతలకు అందజేశారు. జ్యూరీ సభ్యులకు అవార్డులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు అందజేశారు.




2024వ సంవత్సరంలో ఉత్తమ చిత్రాలు

మొదటి ఉత్తమ చిత్రం – కల్కి 2898 ఏడి
రెండో ఉత్తమ చిత్రం – పొట్టెల్
మూడో ఉత్తమ చిత్రం – లక్కీ భాస్కర్
ఉత్తమ బాలల చిత్రం – 35 చిన్న కథ కాదు
చారిత్రక విభాగంలో ఫీచర్ హెరిటేజ్ ఫిలిం – రజాకార్
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం – ఐ అండ్ మై ఫ్రెండ్స్
ఉత్తమ వినోదాత్మక చిత్రం – ఆయ్
ఉత్తమ తొలి చిత్రం దర్శకుడు – కమిటీ కుర్రాళ్లు (యదు వంశీ)

వ్యక్తిగత విభాగంలో పురస్కారాలు
ఉత్తమ దర్శకుడు – నాగ్ అశ్విన్ ( కల్కి 2898 ఏడి)
ఉత్తమ నటుడు – అల్లు అర్జున్ (పుష్ప 2 ది రూల్)
ఉత్తమ నటి – నివేదా థామస్ ( 35 చిన్న కథ కాదు)
ఉత్తమ సహాయ నటుడు – ఎస్జె సూర్య (సరిపోదా శనివారం)
ఉత్తమ సహాయ నటి – శరణ్య (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు)
ఉత్తమ సంగీత దర్శకుడు – భీమ్స్ (రజాకార్)
ఉత్తమ నేపధ్య గాయకుడు – సిద్ శ్రీరామ్ (ఊరి పేరు భైరవకోన)
ఉత్తమ నేపధ్య గాయని – శ్రేయ ఘోషల్ (పుష్ప 2)
ఉత్తమ హాస్య నటుడు – సత్య (మత్తువదలరా 2)
ఉత్తమ బాల నటుడు – మాస్టర్ అరుణ్ తేజ్ (35 చిన్న కథ కాదు), బేబీ హారిక (మెర్సి కిల్లింగ్)
ఉత్తమ కథ రచయిత – శివ పాలడుగు ( మ్యూజిక్ షాప్ మూర్తి)
ఉత్తమ స్క్రీన్ ప్లే – వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ గేయ రచయిత – చంద్రబోస్ (రాజూ యాదవ్)
ఉత్తమ ఛాయాగ్రాహకుడు – విశ్వనాథ్ రెడ్డి (గామి)
ఉత్తమ ఎడిటర్ – నవీన్ నూలి (లక్కీ భాస్కర్)
ఉత్తమ శబ్దగ్రాహకుడు – అరవింద్ మీనన్ (గామి)
ఉత్తమ నృత్యదర్శకుడు – గణేష్ ఆచార్య (దేవర)
ఉత్తమ కళాదర్శకుడు – నితిన్ జిహాని చౌదరి (కల్కి)
ఉత్తమ పోరాట దర్శకుడు – కె చంద్రశేఖర్ రాథోడ్ (గ్యాంగ్ స్టర్)
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ – నల్ల శీను (రజాకార్)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ – అర్చనా రావు – అజయ్ కుమార్ (కల్కి 2898 ఏడి)

స్పెషల్ జ్యురీ అవార్డులు
హీరో దుల్కర్ సల్మాన్ – లక్కీ భాస్కర్
హీరోయిన్ అనన్య నాగళ్ళ – పొట్టెల్
దర్శకులు సుజిత్ – సందీప్ – క
నిర్మాతలు ప్రశాంత్ రెడ్డి – రాజేష్ కల్లెపల్లి – రాజూ యాదవ్
స్పెషల్ జ్యురి స్పెషల్ మెన్షన్ – ఫారియా అబ్దుల్లా (మత్తువదలరా 2)
రచయిత రెంటాల జయదేవ్ – ‘మన సినిమా ఫస్ట్ రీల్’ పుస్తకం

ఉత్తమ చిత్రాలకు అవార్డులు
తెలంగాణ ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చిత్రాలకు అవార్డులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రదానం చేశారు. 2014 జూన్ 2 వతేదీ తెలంగాణ రాష్టం ఆవిర్భావ దినం నుంచి సెన్సార్ అయిన చిత్రాలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని ఏడాదికి మూడు చిత్రాల చొప్పున ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి అవార్డులను డిప్యూటీ సీఎం అందించారు.
2014
ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ : రన్‌ రాజా రన్‌
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ : పాఠశాల
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ : అల్లుడు శ్రీను
2015
ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ - రుద్రమదేవి
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ - కంచె
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ - శ్రీమంతుడు
2016
ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ : శతమానం భవతి
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ : పెళ్లిచూపులు
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ : జనతా గ్యారేజ్
2017
ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ : బాహుబల 2
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ : ఫిదా
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ : ఘాజి
2018
ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ : మహానటి
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ : రంగస్థలం
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ : కేరాఫ్ కంచరపాలెం
2019
ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ : మహర్షి
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ : జెర్సీ
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ : మల్లేశం
2020
ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ : అల వైకుంఠపురములో..
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ : కలర్ ఫోటో
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ : మిడిల్ క్లాస్ మెలోడీస్
2021
ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ : ఆర్ఆర్ఆర్
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ : అఖండ
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ : ఉప్పెన
2022
ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ : సీతారామం
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ : కార్తికేయ 2
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ : మేజర్
2023
ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ : బలగం
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ : హనుమాన్
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ : భగవంత్ కేసరి

ఆరు ప్రత్యేక అవార్డులు ప్రదానం
ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు : నందమూరి బాలకృష్ణ
పైడి జయరాజ్ ఫిలిం అవార్డు, ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ : మణిరత్నం
బీఎన్ రెడ్డి ఫిలిం అవార్డు తెలుగు ఫిలిం డైరెక్టర్ : సుకుమార్
నాగిరెడ్డి, చక్రపాణి ఫిలిం అవార్డు తెలుగు నిర్మాత అట్లూరి పూర్ణ చంద్రరావు
కాంతారావు ఫిలిం అవార్డు తెలుగు ఆర్టీస్టు : విజయ దేవరకొండ
రఘుపతి వెంకయ్య ఫిలిం అవార్డు : యండమూరి వీరేంద్రనాథ్


Read More
Next Story