కుల గణన జీవొ విడుదల, బిసి నేతల హర్షం
కులాల లెక్కలు సంపూర్ణ. వివరాలు సేకరించాలని ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగనే వందరోజులలో కుల గణన ఉత్తర్వులు జారీ చేసింది.
ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న కుల గణనకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది..జీవో నంబర్ 26 తేదీ 15 మార్చ్ 2024 ద్వారా మొత్తం తెలంగాణ ప్రజల జీవన స్థితి గతులు, విద్యా స్థాయి వృత్తి ఉపాధి ఉద్యోగాలు, కుటుంబ స్థితి, కులం, ఆర్థిక స్థాయి మొదలైన సంపూర్ణ వివరాలు సేకరిస్తారు. 1931 తరువాత కుల గణన జరగక పోవడం వల్ల చాలా కులాలకు సంక్షేమ ఫలాలు అభివృద్దిలో భాగ స్వామ్యం అందుకుండా వెనకబడి పోయారు. ఈ సంపూర్ణ కుల గణన సమస్త రంగాల్లో ఆయా సామాజికవర్గాలు ఎలా వున్నాయి తెలుస్తాయి. వారికి ఏమేం చేయాలో తెలుస్తుంది.
ఈ కుల గణన సంపూర్ణ కుటుంబ సర్వే వల్ల జనాభా ప్రాతిపదికన బడ్జెట్లు, నిధులు, రిజర్వేషన్లు పెంచడం వీలవుతుంది. సుప్ర్రిం కోర్టు బీసీల జనాభా లెక్కలు తీసి ఆ ప్రకారం రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని అనేక తీర్పులలో స్పష్ం చేసింది. అందువల్ల ప్రతి విషయానికి బీసీల కులాల లెక్కలు అవసరమయ్యాయి. స్థానిక సంస్థలలో, గ్రామపంచాయతీ, మునిసిపాలిటీ, జిల్లా పరిషత్ లలో రిజర్వేషన్ల పెంపుకు కూడా ఈ లెక్కలు ఆధారంగా వుంటాయి.
గతంలో తమిళనాడులో 1982 లో అంబా కర్ కమిషన్ నూరు ాతం జనాభా కుల గణన కుటుంబ సర్వే చేయడం వల్లనే తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లకు ఆధార ైంది. 2016 లో కర్నాటక లో ఇలాంటి సంపూర్ణ సర్వే నిర్వ హించడం జరిగింది.
ఇంత ముఖ్యం కనుకనే కులాల లెక్కలు సంపూర్ణ. వివరాలు సేకరించాలని ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగనే వందరోజులలో కుల గణన ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు ప్రత్యేక చొరవ తీసుకున్న ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖమంత్రి పొన్నం ప్రభాకర్, ప్రిన్సి పల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం ఐఏఎస్, తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, సీతక్క, దుద్దిల్ల శ్రీధర్ బాబు , ఉత్తం కుమార్ రెడ్డి తదితర మంత్రివర్గ సభ్యులకు బీసీ కమిషన్ తొలి చైర్మన్ బి ఎస్ రాములు ప్రత్యేక అభినందనలు తెలిపారు. భారతీయ ఓబీసీ సమాఖ్య అధ్యక్షులు కె కోటేశ్వరరావు, గౌరవాధ్యక్షులు బి ఎస్ రాములు కృతజ్ఞతలు తలిపారు.