పంచాయతీ ఎన్నికలపై ఈసీకి ప్రభుత్వం లేఖ..
x

పంచాయతీ ఎన్నికలపై ఈసీకి ప్రభుత్వం లేఖ..

పూర్తయిన పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ.


పంచాయతీ ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామంటూ తెలంగాణ ప్రభుత్వం.. ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఈ లేఖ రాసింది. రిజర్వేషన్లకు సంబంధించిన అన్ని వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అన్ని జిల్లాల కలెక్టర్లను సమర్పించి సర్పంచ్, వార్డు సభ్యుల గెజిట్‌లను ప్రభుత్వం ఈసీకి అందించింది. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రిజర్వేషన్లపై రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కసరత్తు చేస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్లతో పాటు, మహిళల రిజ్వేషన్లను కూడా పూర్తి చేసింది.

పంచాయతీలు, వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అన్నీ కలుపుకుని 50శాతం మించకూడదని సిఫార్సు చేసింది కమిషన్. ఈ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేయనుంది. ఈ రిజర్వేషన్ల అంశంపై నవంబర్ 24న హైకోర్టులో జరగనున్న హైకోర్టు విచారణకు ముందే ఒక నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తోంది. ఈ క్రమంలోనే నవంబర్ 24-25 తేదీల్లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావొచ్చని తెలుస్తోంది. డిసెంబర్ నెలలోనే 12,733 పంచాయతీలు, 1,12,288 వార్డుల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Read More
Next Story