నో ఫ్లై జోన్‌గా తెలంగాణ సెక్రటేరియట్..!
x

నో ఫ్లై జోన్‌గా తెలంగాణ సెక్రటేరియట్..!

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవ్.


తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెక్రటేరియట్‌ను నో-ఫ్లై జోన్‌గా ప్రకటించింది. దీంతో సెక్రటేరియట్‌ చుట్టుపక్కల, సెక్రటేరియట్ భవనంపైన డ్రోన్లను ఎగరవేయడం నిషేధం. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలను పాటించాలని తెలిపారు. సచివాలయం రాష్ట్ర పరిపాలనా కేంద్రం కావడంతో ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తరుచుగా ఉంటారు. ఈ కారణంగా భద్రతా ప్రమాణాలు దృష్టిలో పెట్టుకుని మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలోనే సెక్రటేరియట్‌ను నో-ఫ్లై జోన్‌గా ప్రకటించింది. సచివాలయం భద్రతకు డ్రోన్‌ల ద్వారా ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు నివేదించాయి. ఉగ్రవాదులు లేదా అసాంఘిక శక్తులు డ్రోన్లను ఉపయోగించి సచివాలయంపై నిఘా పెట్టడం లేదా దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని నివేదికలు సూచించాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Read More
Next Story