10 వర్సిటీలకు ఇంచార్జ్ వీసీలు
x
Photo credits : Google

10 వర్సిటీలకు ఇంచార్జ్ వీసీలు

తెలంగాణ రాష్ట్రంలోని 10 ప్రభుత్వ యూనివర్సిటీల వైస్ చాన్సిలర్ (వీసీ) ల పదవీకాలం నేటితో ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.


తెలంగాణ రాష్ట్రంలోని 10 ప్రభుత్వ యూనివర్సిటీల వైస్ చాన్సిలర్ (వీసీ) ల పదవీకాలం నేటితో ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త వీసీల నియామకానికి మరో వారం నుంచి పది రోజులు పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అప్పటి వరకు ప్రస్తుత వీసీలనే కొనసాగిస్తారా? లేక వేరేవాళ్లను ఇంచార్జులుగా నియమిస్తారా? అనే ఉత్కంఠకి తెరపడింది. మంగళవారం 10 వర్సిటీలకు ఇంచార్జ్ వీసీలుగా సీనియర్ ఐఏఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు కట్టబెట్టింది.

యూనివర్సిటీలు - ఇంచార్జ్ వీసీలు

ఉస్మానియా యూనివర్సిటీ - దాన కిషోర్

జేఎన్టీయూ - బుర్ర వెంకటేశం

కాకతీయ యూనివర్సిటీ - కరుణ వాకాటి

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ - రిజ్వి

తెలంగాణ యూనివర్సిటీ - సందీప్ సుల్తానియా

పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ - శైలజ రామయ్యర్

మహాత్మా గాంధీ యూనివర్సిటీ - నవీన్ మిట్టల్

శాతవాహన యూనివర్సిటీ - సురేంద్రమోహన్

జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీ - జయేష్ రంజన్

పాలమూరు యూనివర్సిటీ - నదీం అహ్మద్

కాగా, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2021 మే 22న ఈ 10 యూనివర్సిటీలకు వీసీలను నియమించింది. అయితే ఈ వీసీల పదవీకాలం నేటితో ముగిసిపోనుంది. వీళ్ల పదవీకాలం ముగిసేలోపే కొత్త వాళ్లను నియమించాలని రేవంత్ సర్కార్ ప్రయత్నాలు చేసినప్పటికీ, ఎన్నికల కోడ్ కారణంగా ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన పూర్తయిపోయింది. కాకతీయ యూనివర్సిటీ మినహా మిగిలిన 9 యూనివర్సిటీలకు సెర్చ్ కమిటీలను సైతం ప్రభుత్వం నియమించింది. త్వరలోనే ఆ కమిటీల సమావేశాలు షురూ అవుతాయని తెలుస్తోంది.

ఈ క్రమంలో వీసీల నియామక ప్రక్రియ పూర్తికావడానికి మరో వారం నుంచి పది రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో అప్పటి దాకా యూనివర్సిటీలకు ఇంచార్జి వీసీలను నియమించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. కొత్త వీసీలు వచ్చే వరకు వర్సిటీలకు సీనియర్ ఐఏఎస్ లను ఇంచార్జులుగా బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

Read More
Next Story