తెలంగాణ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి పెద్ద పీట
x

తెలంగాణ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి పెద్ద పీట

బడ్జెట్ లో తెలంగాణ సర్కార్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది.


రాష్ట్రంలో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేడు 2024-2025 ఆర్ధిక సంవత్సరానికి పూర్తి స్థాయి ప్రవేశపెట్టింది. రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో డిప్యూటీ సీఎం, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు.. మూలధన వ్యయం రూ.33,487 కోట్లు అని భట్టి పేర్కొన్నారు.

కాగా బడ్జెట్ లో తెలంగాణ సర్కార్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. మొత్తం వ్యవసాయ రంగానికి రూ.72,659 కోట్లు కేటాయిస్తున్నట్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. "లక్ష వరకు రుణం ఉన్న 11.34 లక్షల రైతులకు రుణమాఫీ చేశాం.. రూ.2లక్షల రుణమాఫీ కోసం రూ.31వేల కోట్లు విడుదల చేస్తాం. రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.15వేలు ఇవ్వాలన్నది మా సంకల్పం.. త్వరలో భూమిలేని రైతు కూలీలకు ఏటా రూ.12 వేల అందిస్తాం.. ప్రధాని ఫసల్‌ బీమా యోజనలో చేరబోతున్నాం.. మొత్తం వ్యవసాయ రంగానికి రూ.72,659 కోట్లు.. విద్యుత్‌ రంగానికి రూ.16,410 కోట్లు" కేటాయిస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు.

Read More
Next Story