మాగీ ఆరోపణలపై దర్యాప్తుకు గ్రీన్ సిగ్నల్
x

మాగీ ఆరోపణలపై దర్యాప్తుకు గ్రీన్ సిగ్నల్

మిల్లా మాగీ చేసిన ఆరోపణల్లో ఎంతమేరకు నిజం ఉందనేది తేల్చనున్నారు.


మిస్ వరల్డ్ అందాల పోటీల నుంచి తప్పుకున్న సందర్భంగా మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ సంచలన ఆరోపణలు చేశారు. తమకు ఎంటర్‌టైన్ కోసం తెచ్చుకున్న కోతుల్లా చూశారని, స్పాన్సర్‌ను ఎంటర్‌టైన్ చేయమన్నారని, ఆ సమయంలో తనకు తాను ఒక వేశ్యనా అన్న అనుమానం కలిగిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం రాష్ట్రమంతా తీవ్ర దుమారం రేపింది. ఈ అంశంపై దర్యాప్తుకు ఆదేశాలివ్వాలంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా డిమాండ్ చేశారు.

కాగా ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాగీ చేసిన ఆరోపణలపై దర్యాప్తుకు ఆదేశించింది. సీనియర్ ఐపీఎస్ అధికారి శిఖా గోయల్, ఐపీఎస్ రెమా రాజేశ్వరి, సైబరాబాద్ డీసీపీ సాయిశ్రీ ఆధ్వర్యంలో ఈ అంశంపై దర్యాప్తు జరగనుంది. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ తీరు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు వంటి అనేక అంశాలను పోటీదారులను అడిగి తెలుసుకోనున్నారు. షో ఆర్గనైజింగ్‌పై మిల్లా మాగీ చేసిన ఆరోపణల్లో ఎంతమేరకు నిజం ఉందనేది తేల్చనున్నారు. కంటెస్ట్‌లతో పాటు మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్టీ, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్‌ను కూడా ఈ అంశంపై ప్రవ్నించనున్నారు. పోటీ నుంచి తప్పుకోవడానికి ముందు మిల్లా పాల్గొన్న డిన్నర్‌లో ఎవరెవరు పాల్గొన్నారు, ఆమెతో కూర్చున్న వారు పేర్లు ఏంటి అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

అసలు మాగీ ఏమన్నారంటే..

‘‘ధనవంతులైన పురుష స్పాన్సర్ల ముందు పరేడ్ చేసి నిల్చుని ఉండటం చాలా దారుణంగా అనిపింది. ఆ క్షణం నేనేమైనా వేశ్యనా అన్న భావన కలిగింది. మమ్మల్ని వీళ్లు ఎంటర్‌టైన్మెంట్ కోసం తెచ్చుకున్న కోతుల్లా చూస్తున్నారా? అనిపింది. ఈ ప్రోగ్రామ్ అంతా ఔట్‌డేటెడ్. అంతేకాకుండా చాలా మందిని బోరింగ్‌గా ఉన్నారంటూ తిట్టడం కూడా జరిగింది. ఇక నావల్ల కాదు అనుకున్నా. తప్పుకున్నా. మమ్మల్ని 24 గంటలూ మేకప్ వేసుకునే ఉండమన్నారు. బ్రేక్‌ఫాస్ట్ సమయంలో కూడా బాల్ గౌన్స్ వేసుకునే ఉండాలని చెప్పారు. ఆ తర్వాత షో కోసం భారీగా ఖర్చు చేసినందుకు మధ్యవయసు వ్యక్తులను థాంక్యూగా ఎంటర్‌టౌన్ చేయమన్నారు. అది చూసిన ఒక్క క్షణం నాకేం అర్థం కాలేదు. ఇది చాలా తప్పనిపించింది. మిస్ వరల్డ్ ఆర్గనైజర్స్ మమ్మల్ని ట్రీట్ చేసిన తీరు చూసి నేనేమైనా వేశ్యనా అన్న అనుమానం వచ్చింది. ఒకసారి మాట్లాడి చూద్దాం అనుకున్నా కానీ ఎవరూ ఇంట్రస్ట్ చూపించలేదు. అందుకే బయటకు వచ్చేశా. డిఫరెంట్ ఫ్యూచర్‌ని క్రియేట్ చేయాలనుకంటున్నా. అసలు మమ్మల్ని వాళ్లు చాలా అగౌరవంగా చూశారు. అప్పుడు మిస్ వరల్డ్ నిజస్వరూపాన్ని కనిపించింది’’ అని మిల్లా చెప్పుకొచ్చారు.

Read More
Next Story