
మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు.. దేశంలోనే తొలిసారి..
మార్చి 8న వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా 50 బస్సులను కేటాయించనున్నారు.
రాష్ట్రంలోని మహిళలను ఆర్థికంగా బలపరచడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ సహా మంత్రులు పలు సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు అదే పనిని ఆచరణలో పెట్టారు. మహిళా సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీ బస్సులను కేటాయించడానికి సన్నాహాలు ప్రారంభించేసింది కాంగ్రెస్ సర్కార్. అతిత్వరలోనే మహిళా సమాఖ్యలకు ఆర్టీసీ బస్సులు కేటాయిస్తామని వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. మార్చి 8న మహిళా దినోత్సాన్ని పురస్కరించుకుని మహిళలకు బస్సులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనుంది. ఆ వేడుకల్లోనే మహిళలకు ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయించనున్నట్లు సమాచారం.
ఆర్టీసీ బస్సులను మహిళలకు విడతల వారీగా అందించనున్నారు. తొలి విడతలో 150 మండల సమాఖ్యలకు 150 ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించనున్నారు. ఆ తర్వాత మిగిలిన మండల సమాఖ్యలకు 450 ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయిస్తారు. ప్రతి నెల ఒక్కో బస్సుకు రూ.77,220 అద్దె చెల్లించడానికి తెలంగాణ ఆర్‌టీసీ సిద్ధమైంది. బస్సుల కొనుగోలు కోసం మహిళా సంఘాలకు బ్యాంకుల గ్యారెంటీని ప్రభుత్వమే స్వయంగా అందించనుంది. దేశంలో మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సులను కేటాయించడం ఇదే తొలిసారి. మార్చి 8న వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా 50 బస్సులను కేటాయించనున్నారు.
కాగా కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చసిన జీవోపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తునస్నాయి. మాటలు కాదు.. చేతల్లో చేసి చూపండంటూ ఎద్దేవా చేస్తున్నారు. మాటలు చెప్పడంలో కాంగ్రెస్ నేతలు దిట్టలని, పనులు చేయమంటే మాత్రం కళ్లు తేలేస్తారంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం చెప్తున్న ఆర్టీ బస్సుల కేటాయింపుల్లో చాలా అవకతవకలు ఉన్నాయని, ఈ స్కీమ్‌ను ముందుగా సవివరంగా వివరించాలని ప్రజలు కోరుతున్నారు.