సంబురాల్లో తెలంగాణ రైతులు
x

సంబురాల్లో తెలంగాణ రైతులు

తెలంగాణ ప్రభుత్వం తొలి విడత రుణమాఫీ నిధులు విడుదల చేసింది.


తెలంగాణ ప్రభుత్వం తొలి విడత రుణమాఫీ నిధులు విడుదల చేసింది. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు రైతుల అకౌంట్లలో రూ.లక్ష రుణమాఫీ నిధులు జమ అయ్యాయి. తొలివిడతలో భాగంగా రాష్ట్రంలోని రాష్ట్రవ్యాప్తంగా లక్ష రూపాయల లోపు రుణాలు కలిగిన దాదాపు 11.50 లక్షల రైతులకి బ్యాంకు ఖాతాల ద్వారా రూ.6,098 కోట్ల రూపాయల రుణాలు మాఫీ అయ్యాయి. రెండవ విడతలో నెలాఖరులోగా రూ.లక్షన్నర వరకు ఉన్న రుణాలు, మూడవ విడతలో ఆగస్టు 15లోగా రూ.2లక్షల వరకు ఉన్న రైతుల రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.


కాగా, సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం సచివాలయంలో రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రుణమాఫీ పొందిన వివిధ జిల్లాల రైతులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహా దారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు కె కేశవరావు, సీఎస్ శాంతి కుమారి, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రుణమాఫీ అయిన రైతులతో రైతు వేదికల్లో వీడియా కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి, రైతుల కళ్ళలో ఆనందం చూడటం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రతి రైతును రుణ విముక్తి చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రైతుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికే రుణమాఫీ నిర్ణయమని చెప్పారు.

సంబురాల్లో రైతులు, కాంగ్రెస్ శ్రేణులు...

రూ.లక్ష రుణమాఫీ పొందిన రైతులు రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు జరుపుకుంటున్నారు. సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకాలు జరుపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు అన్ని రైతువేదికల వద్ద సంబురాలు, ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. గాంధీ భవన్ లోనూ భారీగా సంబరాలు నిర్వహిస్తున్నారు. రైతు రుణమాఫీ చేస్తున్న సందర్భంగా బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకొని కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నారు.

Read More
Next Story