టెట్ నోటిఫికేషన్ వచ్చేసింది.. అప్పటి నుంచే స్టార్ట్..
x

టెట్ నోటిఫికేషన్ వచ్చేసింది.. అప్పటి నుంచే స్టార్ట్..

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తెలంగాణ టెట్ నోటిఫికేషన్ ఎట్టకేలకు విడుదలైంది. నవంబర్ 5 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభం కానుందని అధికారులు వెల్లడించారు.


ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తెలంగాణ టెట్ నోటిఫికేషన్ ఎట్టకేలకు విడుదలైంది. నవంబర్ 5 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభంకానుందని అధికారులు వెల్లడించారు. దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 20 ఆఖరు తేదీగా అధికారులు ప్రకటించారు. అంతేకాకుండా 1 జనవరి 2025 నుంచి 20 జనవరి వరకు ఆన్‌లైన్‌లో కంప్యూటరక్ బేస్డ్ పరీక్ష నిర్వహించనున్నారు అధికారులు. ఇకపై రాష్ట్రంలో ఏడాదికి రెండు సార్లు టెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ఇందులో తొలి నోటిఫికేషన్ కింద మే 20వ తేదీ నుంచి జూన్ 2 వరకు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించింది సర్కార్. ఇప్పుడు ఏడాది పూర్తికావొస్తున్న క్రమంలో రెండో విడత టెట్ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారన్నది హాట్ టాపిక్‌గా ఉంది. అంతేకాకుండా రెండో విడత నోటిఫికేషన్‌ను నవంబర్‌లో విడుదల చేసి పరీక్ష మాత్రం జనవరిలో జరుపుతామని కూడా ఆగస్టు నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల సమయంలో ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు నవంబర్ నెల రావడంతో రెండో విడత టెట్ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. 4 నవంబర్ 2024న నోటిఫికేషన్ విడుదల చేసి అభ్యర్థుల ఎదురుచూపులకు ప్రభుత్వం తెరదించింది. ఇందులో భాగంగానే ఈరోజు ఉదయం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

టెట్ పేపర్-1కు డీఈడీ, పేపర్-2కు బీఈడీ ఉత్తీర్ణులైన వారు అర్హులు. స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందడం కోసం టెట్ అర్హత ఉండాలని చెప్తుండటంతో వేల మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా ఈ పరీక్ష రాయడానికి సన్నద్ధం అవుతున్నారు. వారంతా కూడా ఇప్పుడు పరీక్షలకు హాజరుకానున్నారు. టెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు తొమ్మది సార్లు పరీక్షలు జరగ్గా జనవరిలో పదోసారి పరీక్ష జరగనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే రెండోసారి టెట్‌ను నిర్వహిస్తుండటం గమనార్హం.

Read More
Next Story