ఆరుగురు అధికారులపై సర్కార్ వేటు
x

ఆరుగురు అధికారులపై సర్కార్ వేటు

తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు అధికారులపై వేటు వేసింది. గనులు, భూగర్భ శాఖలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆఫీసర్లను సస్పెండ్ చేసింది.


తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు అధికారులపై వేటు వేసింది. గనులు, భూగర్భ శాఖలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆఫీసర్లను సస్పెండ్ చేసింది. గనుల శాఖలో డిప్యుటేషన్ పై జీఎంలుగా పని చేస్తున్న పాండురంగారావు, దేవేందర్ రెడ్డి, ప్రశాంతి, ప్రాజెక్టు ఆఫీసర్స్ దశరథం, తోట శ్రీధర్, సూపరింటెండెంట్ శ్రీనివాస్ లను మాతృ సంస్థలకు ట్రాన్స్ఫర్ చేసింది. ఆఫీసర్ల అవినీతిపై కంప్లైంట్స్ రావడంతో విచారణ జరిపిన ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకుంది.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్న అధికారులపై దృష్టి సారించింది. అవినీతి, అక్రమాలు బయటపడితే లేటు చేయకుండా వేటు వేస్తోంది. ఇటీవల అక్రమాస్తుల కేసులో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్ రావును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల కిందట ఫోన్ల ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ ఇన్ స్పెక్టర్ గా పనిచేసిన ప్రణీత్ రావును అరెస్టు చేసి విచారణ చేపట్టింది. ఇక అదే కేసులో పోలీసు అధికారులు భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులు కూడా అరెస్టై జైల్లో ఉన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబీ మాజీ చీఫ్​ ప్రభాకర్ రావు ను రెడ్ కార్నర్ నోటీసుల ద్వారా విదేశాల నుండి రాష్ట్రానికి రతెలంగాణ ప్రభుత్వం ఆరుగురు అధికారులపై వేటు వేసింది. గనులు, భూగర్భ శాఖలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆఫీసర్లను సస్పెండ్ చేసింది.ప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అక్రమాస్తుల కేసులో శివ HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ తోపాటు ఆయన సోదరుడిని, సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం శివ బాలకృష్ణ బెయిల్ పై బయట ఉన్నారు.

బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ కేసును తారుమారు చేసేందుకు ప్రయత్నించిన పంజాగుట్ట సీఐ దుర్గారావుపై సర్కారు సస్పెన్షన్ వేటు వేసింది. ఈ వ్యవహారాన్ని లోతుగా పరిశీలించి ఠాణా మొత్తాన్ని ట్రాన్స్ ఫర్ చేయడం సంచలనం రేపింది. ఇక రాష్ట్రంలో ఏసీబీ అధికారులు తరచూ అవినీతికి పాల్పడుతున్న అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటున్న వార్తలు రోజూ వింటూనే ఉన్నాం.

Read More
Next Story