తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ అక్టోబర్ 21వ తేదీ నుంచి ....
తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) విడుదల చేసింది. అక్టోబర్ 21వ తేదీ నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నట్లు పేర్కొంది. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. గ్రూప్-1 మెయిన్స్ లో ఆరు పేపర్లు ఉంటాయి. ప్రతీ పేపర్ 3 గంటల వ్యవధిలో 150 మార్కులకు ఉంటుంది. కాగా, ఈ నెల 9వ తేదీన గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష జరగగా... త్వరలోనే ఫలితాలు వెలువడనున్నాయి. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయినవారు మెయిన్స్ పరీక్ష రాసేందుకు అర్హత సాధించనున్నారు.
మెయిన్స్ పరీక్షల షెడ్యూల్...
అక్టోబర్ 21-జనరల్ ఇంగ్లీష్ (క్వాలిఫయింగ్ టెస్ట్)
అక్టోబర్ 22-పేపర్ 1 (జనరల్ ఎస్సే)
అక్టోబర్ 23-పేపర్ 2 (హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ)
అక్టోబర్ 24-పేపర్ 2 (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం అండ్ గవర్నెన్స్)
అక్టోబర్ 25-పేపర్ 4 (ఎకానమి అండ్ డెవలప్మెంట్)
అక్టోబర్ 26-పేపర్ 5 (సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డాటా ఇంటర్ ప్రిటేషన్)
అక్టోబర్ 27-పేపర్ 6 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు)
గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షను ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషలలో రాయవచ్చు. ప్రశ్నాపత్రాలను ఈ మూడు భాషలలో అందిస్తారు. అభ్యర్థులు ఏ భాషను ఎంకుకుంటాను అన్నీ పేపర్లను అదే భాషలోరాయాల్సి ఉంటుంది. కొన్ని పేపర్లను ఒక భాషలో, ఇతర పేపర్లను మరొక భాషలో రాయడానికి అనుమతి లేదు. ఈ విషయాలను ఇంతకు ముందే అభ్యర్థులకు తెలియ చేశారు. ఇదేవిధంగా అభ్యర్థులు అన్నీ పేపర్ల పరీక్షలు రాయాలి. ఏ ఒక్కటి రాయకపోయినా డిస్ క్వాలిఫై అవుతారు.