తెలంగాణని ఢిల్లీ ATM గా మార్చిన కాంగ్రెస్ నేతలు
x

'తెలంగాణని ఢిల్లీ ATM గా మార్చిన కాంగ్రెస్ నేతలు'

మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకి మద్దతుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రచారంలో పాల్గొన్నారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.


మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకి మద్దతుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రచారంలో పాల్గొన్నారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మోడీని మూడోసారి ప్రధానమంత్రిగా గెలిపిస్తే తెలంగాణాలో అవినీతి అంతం అవుతుందన్నారు.

కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒకటే అన్నారు. ఈ రెండు పార్టీలు మజ్లీస్ పార్టీ కి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించట్లేదన్నారు అమిత్ షా. బీజేపీకి అలాంటి భయాలు ఏమీ లేవు, అందుకే సెప్టెంబర్ 17 న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించుకున్నాము.

తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ముస్లింలకు కల్పించిన రిజర్వేషన్లు రద్దు చేసి.. ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు తెస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలు తెలంగాణను మార్చారు అని అమిత్ షా ఆరోపించారు.

అయోధ్యలో రామ మందిరం నిర్మించడం కాంగ్రెస్ కి ఇష్టం లేదని, కేసులు వేశారని, అయినప్పటికీ మందిర నిర్మాణం పూర్తి చేశామని గుర్తు చేశారు. కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేసి 70 ఏళ్ళ సమస్యను పరిష్కరించమని చెప్పారు.

తెలంగాణాలో 12 సీట్లలో బీజేపీని గెలిపించాలని అమిత్ షా ప్రజలను కోరారు. కేంద్రంలో మళ్ళీ వచ్చేది బీజేపీనే అని బలంగా చెప్పారు. 405 సీట్లలో బీజేపీ గెలవబోతుందని జోస్యం చెప్పారు. మళ్ళీ దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని అమిత్ షా అన్నారు.

Read More
Next Story