‘పామ్ ఆయిల్ హబ్‌గా తెలంగాణ’.. ప్రభుత్వ ప్లాన్ చెప్పిన మంత్రి తుమ్మల
తెలంగాణను ఆయిల్ పామ్ హబ్‌గా మార్చాలని తమ ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
తెలంగాణను ఆయిల్ పామ్ హబ్‌గా మార్చాలని తమ ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇదే అంశంపైనే ఇటీవల మలేషియా పర్యటనకు కూడా వెళ్లినట్లు వివరించారు. మలేషియా పర్యటనలో అనేక అంశాలను పరిశాలించామని, పామాయిల్ సాగుకు వారి వినియోగించే పద్దతులు ప్లాంట్ పర్ాసెసింగ్, రిఫైనరీ ప్లాంట్స్ వంటి విషయాల గురించి అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. అదే విధంగా ఆయిల్ పామ్ సాగు, రాబడి వంటి అనేక విషయాలపై ఆ దేశ వ్యవసాయశాఖ మంత్రులతో చర్చించినట్లు కూడా వివరించారాయన. ఆయిల్ పాట్ సాగుతో పాటుగా తెలంగాణ, మలేషియా మధ్య వాణిజ్య అవకాశాలపై కూడా సుదీర్ఘ చర్చలు చేశామని, ఈ చర్చలు ఫలదాయకంగా సాగాయని మంత్రి తుమ్మల వివరించారు. తెలంగాణలో కూడా ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేలా తమ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని, ఇప్పటికే ఏయే జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగుకు అనుమతులు ఉన్నాయో కూడా పరిశీలిస్తోందని వెల్లడించారు.
31 జిల్లాలకు అనుమతులు..
‘‘తెలంగాణలో ఆయిల్ పామ్‌ను సాగు చేయడానికి 31 జిల్లాల దగ్గర అనుమతులు ఉన్నాయి. ఆయిల్ పామ్ సాగును ఫెడ్‌తో పాటు 14 వేరువేరు ప్రరైవేట్ సంస్థలకు అప్పగించనున్నాం. తద్వారా పామాయిల్ సాగు విస్తరణ అధికమవుతుంది. తక్కువ ఎత్తు కురచ ఆకుతో ఎక్కువ దిగుబడులు ఇచ్చే ఆయిల్ పామ్ మొక్కల కోసం మలేషలో వెతికాం. ఆయిల్ పామ్‌తో పాటు దాని అంతర పంటలుగా కోకో, జాజికాయ, వక్క, మిరియం సాగు చేయొచ్చు. ఆయిల్ పామ్‌లో అంతర పంటలకు సబ్సిడీలు ఇస్తాం. భారతదేశం ప్రతి ఏడాది రూ.లక్షల కోట్లకు విలువైన వంటనూనెలను దిగుమతి చేసుకుంటుంది. అదే దేశవ్యాప్తంగా ఆయిల్ పామ్‌ను 70 లక్షల ఎకరాల్లో సాగు చేస్తే వంటనూనెలు దిగమతి చేసుకోవాల్సిన అవసరం భారత్‌కు ఉండదు. మలేషియా పర్యటనలో భాగంగా ఆయిల్ పామ్ సాగు గురించి తెలుసుకున్న అన్ని విషయాలను రైతులకు వివరిస్తాం’’ అని మంత్రి తుమ్మల తెలిపారు.
విరివిగా పామాయిల్ సాగు..
‘‘తెలంగానలో ఆయిల్ పామ్ సాగును విరివిరిగా చేపట్టాలి. ప్రస్తుతం రాష్ట్రంలో 44,400 ఎకరాల ఆయిల్ పామ్ తోటలు ఉన్నాయి. వాటన్నింటి నుంచి 2.80 లక్షల టన్నుల పామాయిల్ గెలలు దిగుబడి ఉంది. కేంద్రం తీసుకునన తాజా నిర్ణయంతో తెలంగాణలో పామాయిల్ సాగును పెద్ద ఎత్తున చేపట్టాడానికి అవకాశాలు పెరిగాయి. రైతులంతా కూడా పామాయిల్ సాగులో భాగస్వాములు కావాలి. అప్పుడే పామాయిల్ హబ్‌గా తెలంగాణ నిలుస్తుంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత పామాయిల్‌ను సాగు చేయాలి. తద్వారా రైతులతో పాటు ప్రభుత్వానికి కూడా లాభముంటుంది’’ అని అన్నారు మంత్రి తుమ్మల.
నిరాశలో రైతులు
కానీ పామాయిల్ దిగుమతిపై పన్ను ఎత్తేయడంతో రైతులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఈ కారణంగానే పామాయిల్ గెలల ధర గణనీయంగా తగ్గిపోయిందని, ఇది పంట సాగు చేయాలనుకునేవారిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని మంత్రి తుమ్మ ఇటీవల కేంద్రప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకునే రైతులకు అధిక ధరలు అందేలా చర్యలు తీసుకున్నారు మంత్రి. ఇదే అంశంపై ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కూడా చర్చించామని, దీంతో పననులు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుందని చెప్పారు.