గ్రూప్ 1 పరీక్షలపై తెలంగాణ హైకోర్టులో విచారణ
x

గ్రూప్ 1 పరీక్షలపై తెలంగాణ హైకోర్టులో విచారణ

పారదర్శకంగా జరిగిందని ప్రభుత్వ న్యాయవాది వాదనలు


తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీఎస్సీ) గ్రూప్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ చేస్తోంది. టీజీ ఎస్సీ తరపున సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. పరీక్ష రాసిన విద్యార్థుల సంఖ్యలో ఎలాంటి మార్పు లేదని న్యాయవాది కోర్టుకు చెప్పారు.

కోఠిలోని ఓ పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసిన విద్యార్థులే ఎంపికయ్యారని వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఆయన వాదనలు వినిపించారు.

అక్కడ ఉన్న రెండు కేంద్రాలలో 1500 మంది మెయిన్ పరీక్షలు రాశారు. మిగతా ప్రాంతాలలో పరీక్షలు రాసిన అభ్యర్థులే ఎక్కువగా ఎంపికయ్యారు. ఉద్యోగాలు రాని వారు ఏవేవో అనుమానాలతో పిటిషన్లు వేసారని నిరంజన్ రెడ్డి కోర్టుకు చెప్పారు.

గ్రూప్ 1 పరీక్షల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వర రావు గురువారం విచారణ కొనసాగించారు.

గత సంవత్సరం తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు పరీక్షలు జరిగాయి.


Read More
Next Story