Telangana High Court | తెలంగాణ కొత్త సీజేగా జస్టిస్ సుజయ్ పాల్
x

Telangana High Court | తెలంగాణ కొత్త సీజేగా జస్టిస్ సుజయ్ పాల్

తెలంగాణ హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ సుజయ్ పాల్ ను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్థుత చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే బాంబే కు బదిలీ అయ్యారు.


తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా హైకోర్టు సీనియర్ జడ్జి జస్టిస్ సుజయ్ పాల్ ను నియమించారు. తెలంగాణ సీజే జస్టిస్ అలోక్ అరాధే బాంబే హైకోర్టు సీజేగా బదిలీ కావడంతో ఆయన స్థానంలో సుజయ్ పాల్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు.

- 1964 వ సంవత్సరం జూన్ 21 వతేదీన జన్మించిన జస్టిస్ సుజయ్ పాల్ బీకాం ఎల్ ఎల్ బీ చదివి మధ్య ప్రదేశ్ బార్ కౌన్సిల్ న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు. మానవ హక్కుల కమిషన్, బ్యాంకులకు న్యాయవాదిగా సేవలు అందించారు.
- అనంతరం 2011 మే 27వతేదీన మధ్య ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2014లో శాశ్వత న్యాయమూర్తిగా అయ్యాక సుప్రీంకోర్టు కొలిజీయం సిఫార్సుతో గత ఏడాది మార్చి 21 వతేదీన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఆపై ప్రస్థుతం సీజేగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.



Read More
Next Story