Patnam Narender | పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టు ఝలక్..
x

Patnam Narender | పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టు ఝలక్..

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌కు తెలంగాణ హైకోర్టు భారీ ఝలక్ ఇచ్చింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసింది.


బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌(Patnam Narender)కు తెలంగాణ హైకోర్టు(High Court) భారీ ఝలక్ ఇచ్చింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం బుధవారం.. కోర్టు కొట్టివేసింది. లగచర్ల(Lagacharla)లో కలెక్టర్ సహా ఇతర అధికారులపై దాడులు చేసేలా స్థానికులను రెచ్చగొట్టారన్న ఆరోపణలు నేపథ్యంలో పట్నం నరేందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని చర్లపల్లి జైలులో ఉంచారు. ఈ క్రమంలోనే పట్నం నరేందర్.. హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ను దాఖలు చేశారు. తన రిమాండ్‌ను క్వాష్ చేయాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. ఆయన పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు.. ఈరోజు విచారణ జరిపింది. వాదనల అనంతరం కోర్టు.. ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. ఇది పట్నం నరేందర్‌కు భారీ ఎదురుదెబ్బగా మారింది. కాగా పట్నం నరేందర్‌కు తొలుత విధించిన రిమాండ్‌ ముగియడంతో.. తాజాగా అతని రిమాండ్‌ను పొడిగిస్తూ న్యాయస్థానం మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రత్యేక బ్యారక్‌కు ఓకే

పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత పట్నం నరేందర్.. ఐదుగురు ఖైదీలతో కలిసి ఒకే బ్యారక్‌ను పంచుకున్నారు. ఈ క్రమంలోనే తనకు ప్రత్యేక బ్యారక్ కేటాయించాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు అందుకు అనుమతించింది. ఈమేరుకు చర్లపల్లి సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఆయనకు ఇంటి భోజనాన్ని కూడా అనుమతించాలని ఆదేశాలిచ్చింది న్యాయస్థానం. ఆ సమయంలోనే తన రిమాండ్‌ను రద్దు చేయాలని కూడా పట్నం నరేందర్.. క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు పట్నం నరేందర్ రెడ్డి. ఆ పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. ఆ పిటిషన్‌ను కొట్టివేసింది.

అసలు ఏం జరిగిందంటే..

వికారాబాద్ జిల్లా దుద్యాల మండటం లగచర్ల, పోలేపల్లిలో 1350 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఫార్మా సిటీ కోసం భూసేకరణపై ప్రజాభిప్రాయం తెలుసుకోవడం కోసం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సహా పలువురు ఇతర అధికారులు లగచర్ల, పోలేపల్లికి చేరుకున్నారు. కాగా అక్కడ వారికి తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదురైంది. అధికారులక వ్యతిరేకంగా గ్రామస్తులు, రైతులు నినాదాలు చేశారు. అంతేకాకుండా అధికారులపై కర్రలు, రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో అధికారులకు చెందిన మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.

ఈ కేసు విచారణలో భాగంగా కలెక్టర్‌పై దాడి చేసేలా ప్రజలను రెచ్చగొట్టిన వ్యక్తి బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ ప్రధాన అనుచరుడు సురేష్‌గా పోలీసులు గుర్తించారు. ఈ దాడి జరగడానికి ముందే పట్నం నరేందర్, సురేష్ పదుల సంఖ్యలో ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పట్నం నరేందర్ కూడా సురేష్‌తో మాట్లాడారు. ఈ సందర్బంగానే కేటీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు విచారణలో వెలల్లడైంది. ఈ విషయాన్ని స్పష్టం చేయడం కోసం డీజీపీ ఇప్పటికే సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. సురేష్‌పై ఇప్పటికే అత్యాచారం సహా పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో సురేష్‌పై ఉన్న కేసులను తొలగించడం కోసం పట్నం రేందర్ కీలకంగా వ్యవహరించారిన కూడా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు.. పట్నం రేందర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Read More
Next Story