రిజర్వేషన్లలో జోక్యం చేసుకోలేం: హైకోర్ట్
x

రిజర్వేషన్లలో జోక్యం చేసుకోలేం: హైకోర్ట్

పంచాయతీ రాజ్ ఎన్నికల రిజర్వేషన్లపై తీర్పు వెలువరించిన ఉన్నత న్యాయస్థానం.


తెలంగాణ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల అంశంలో తాము జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు వెల్లడించింది. రిజర్వేషన్ల ఖారారు విషయంలో అవకతవకలు జరిగాయని, జనాభా సంఖ్య ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వలేదంటూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అంతేకాకుండా రిజర్వేషన్లు 17శాతం ఇవ్వడంపై కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారించిన న్యాయస్థానం గురువారం తీర్పు వెలువరించింది. చట్టప్రకారం ఎన్నికల ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.

ఎస్సీ, ఎస్టీ జనాభా లేని ప్రాంతాల్లో కూడా ఆయా కులాలకు వార్డుమెంబర్లు, సర్పంచ్ స్థానాలను రిజర్వ్ చేశారని పలువురు పిటిషన్‌లు దాఖలు చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం సర్పంచ్ స్థానాల రిజర్వేషన్లు ఖరారు చేయడం వల్ల పలు ప్రాంతాల్లో తప్పులు దొర్లాయని పేర్కొన్నారు. ఈ పిటిషన్ల విచారణలో రిజర్వేషన్లు కేటాయించిన ప్రాంతంలో సంబంధిత కులాల వారు లేకపోతే ఆ స్థానాలకు ఎన్నికలు నిర్వహించమని ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది. రాష్ట్ర ఎన్నికల సంఘం వాదనను రికార్డ్ చేసుకున్న న్యాయస్థానం ఈ పిటిషన్లపై విచారణను ముగించింది.

Read More
Next Story