తెలంగాణ బీసీ రిజర్వేషన్ల జీఓపై హైకోర్టు స్టే..
x

తెలంగాణ బీసీ రిజర్వేషన్ల జీఓపై హైకోర్టు స్టే..

నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి ఉత్తర్వులు.


వెనకబడిన కులాలకు 42 శాతం రిజర్వేషన్లు అందిస్తూ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నెం.9 (GO MS 9) పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది.

జీవోను ఛాలెంజ్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్, జస్టిస్ జీఎం మొహుయిద్దీన్‌ల ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

జీవొ 9 చట్టవిరుద్ధమని కేశవాపురం మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశాడు. అదే ఇపుడు విచారణకు వచ్చింది.

ఈ అంశంలో కౌంటర్ దాఖలు చేయడం కోసం ప్రభుత్వానికి నాలుగు వారాల సమయం ఇచ్చింది. అంతేకాకుండా రెండు వారాల్లో సమాధానాలు దాఖలు చేయాలని పిటిషనర్లకు తెలిపింది. అనంతరం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల పై కూడా స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ అంశంలో న్యాయస్థానం తీర్పు వచ్చే వరకు స్థానిక ఎన్నికలు లేనట్లే.

స్థానిక ఎన్నికలకు బ్రేక్..

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నాలుగు వారాల వరకు బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత కూడా వెంటనే జరుగుతాయన్న నమ్మకం లేదు. అప్పుడు విచారణ జరిగి కోర్టు తీర్పు వెలువరించే వరకు స్థానిక ఎన్నికల నిర్వహణ గాల్లో దీపంలా మారింది. దీంతీ రాజకీయ పార్టీలు అయోమయానికి గురయ్యాయి. ఇప్పుడు జాబితాలు సిద్దం చేసుకోవాలా వద్దా? చేసుకుంటే రిజర్వేషన్లను అనుసరించాలా? వద్దా? అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. దీంతో రాజకీయ పార్టీల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా దాదాపు అటకెక్కింది.

ఈటల చెప్పినట్లే జరిగిందే..

అయితే ప్రభుత్వం జీవో విడుదల చేసిన తర్వాత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఒక వీడియో విడుదల చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎవరూ కూడా తొందరపడొద్దని, కాస్తంత నెమ్మదిగా వ్యవహరించండి సూచించారు. ఆ సందర్భంగానే ఈ జీవో సరైనది కాదన్నారు. కోర్టులో ఇది నిలబడదని, న్యాయస్థానం దీనినిపై స్టే విధించిన, మహారాష్ట్రలో తరహాలో ఎన్నికలను రద్దు చేసిన ఇబ్బందులకు గురవుతారని, కాబట్టి ఈ అంశంలో క్లారిటీ వచ్చే వరకు ఎవరూ కూడా పార్టీలు, గీర్టీలు, రోడ్‌షోలు, సభలు అంటూ ఖర్చులు పెట్టుకోవద్దని హెచ్చరించారు. ఆయన ఊహించినట్లు గురువారం న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులతో స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయి.

Read More
Next Story