ఐఏఎస్ అమ్రపాలీకి తెలంగాణ హైకోర్ట్ షాక్
x

ఐఏఎస్ అమ్రపాలీకి తెలంగాణ హైకోర్ట్ షాక్

క్యాట్ ఉత్తర్వులపై స్టే విధించిన ఉన్నత న్యాయస్థానం.


ఐఏఎస్ అధికారి అమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది. ఆంధ్ర, తెలంగాణ మధ్య అధికారులు కేటాయింపుల అంశంలో అమ్రపాలిని తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఆ ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టు సోమవారం స్టే విధించింది.

ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి నియామక వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆమెను తెలంగాణ కేడర్‌కు కేటాయిస్తూ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ (CAT) ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. క్యాట్ ఆదేశాలపై DOPT దాఖలు చేసిన పిటిషన్ విచారించిన ధర్మాసనం స్టే జారీ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ప్రకటించింది. హైకోర్టు, ఆమ్రపాలి తరఫు న్యాయవాదికి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించగా, తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.

అసలేమైందంటే..

గత ఏడాది అక్టోబర్‌లో DOPT, ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు అలాట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని ఆమ్రపాలి క్యాట్‌లో సవాల్ చేశారు. విచారణ అనంతరం క్యాట్, ఐఏఎస్ హరికిరణ్‌తో స్వాపింగ్ ప్రక్రియలో భాగంగా ఆమెను తెలంగాణకు కేటాయిస్తూ తీర్పు ఇచ్చింది.

అయితే, ఈ స్వాపింగ్ చెల్లుబాటు అయ్యేదేమో అన్న సందేహంతో DOPT హైకోర్టును ఆశ్రయించింది. హరికిరణ్ రిజర్వ్ కేటగిరీకి చెందిన వారు కావడంతో, ఆయనతో ఆమ్రపాలికి స్వాపింగ్ వర్తించదని తమ వాదనలో పేర్కొంది.

క్యాట్ ఆదేశాలు అమలవ్వవు

ఈ నేపథ్యంలో హైకోర్టు, క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. ఆమ్రపాలి కౌంటర్ దాఖలు చేసే వరకు క్యాట్ ఆదేశాలు అమల్లో ఉండబోవని స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణను ఆరువారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం.

Read More
Next Story