
తెలంగాణ హైకోర్టునూ వదలని హ్యాకర్లు !
ఆర్డర్ కాపీలు డౌన్ లోడ్ చేస్తుంటే బెట్టింగ్ యాప్ లు ప్రత్యక్షం
తెలంగాణ హైకోర్టు వెబ్ సైట్ హ్యాక్ అయింది. ఆర్డర్ కాపీలను డౌన్ లోడ్ చేస్తుంటే ఆన్ లైన్ బెట్టింగ్ వెబ్‌సైట్‌లు ప్రత్యక్షం అవుతున్నాయి. దీంతో సిబ్బంది ఖంగుతిన్నారు. వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పీడీఎఫ్ ఫైల్స్ కు బదులు BDG SLOT అనే బెట్టింగ్ సైట్ ఓపెన్ కావడంతో హైకోర్టు రిజిస్ట్రార్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యంలో కీలక పిల్లర్ అయిన న్యాయ వ్యవస్థను కూడా వదలకుండా సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేయడం సంచలనమైంది. ఈ ఘటన నవంబర్ 11 వ తేదీన చోటు చేసుకున్నప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన వారెవరో తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వెబ్ సైట్ సమస్యను తాత్కాలికంగా క్లియర్ చేశారు. తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన అధికార వైబ్ సైట్ లో ప్రతీ కేసుకు సంబంధించిన వివరాలు అందుబాటులో ఉంటాయి. ఏ కేసు ఎప్పుడు విచారణకు వస్తుంది. న్యాయమూర్తుల వివరాలు కూడా ఉంటాయి. వెబ్ సైట్ హ్యాక్ అయినట్టు ఐటీ టీమ్ రిజిస్ట్రార్‌కు సమాచారం ఇచ్చింది. ఐపి అడ్రస్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.

