తెలంగాణలో సీనియర్ IAS ఆఫీసర్ కు మెమో
x
IAS Arvind Kumar With KTR (curtsy face book)

తెలంగాణలో సీనియర్ IAS ఆఫీసర్ కు మెమో

కేటీఆర్ ను బిగించేందుకు ఆయన కింద పని చేసిన సీనియర్ ఐఎఎస్ పై రేవంత్ సర్కార్ వల విసిరింది. ఫార్మూలా-ఇ రేసుకు డబ్బులెందుకు ఇచ్చారో చెప్పాలంటూ తాకీదులు ఇచ్చింది..


తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో చక్రం తిప్పిన కీలక ఐఎఎస్ ల వ్యవహారాలపై వేట మొదలైంది. కేసీఆర్ పేషీలో అన్నీ తానై హెలికాఫ్టర్లలో తిరిగిన ఐఎఎస్ స్మితా సబర్వాల్ ను అనామక శాఖకు మార్చి వారం గడవక ముందే.. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్ కార్యాలయంలో తల్లో నాలుకలా ఉన్న సీనియర్ ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్ కు నోటీసులు జారీ అయ్యాయి. ఎలక్ట్రానిక్ కార్ల రేసింగ్ పోటీలకు 55 కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వాల్సివచ్చిందో చెప్పాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తాకీదులిచ్చింది. వారం రోజుల్లోపల సమాధానం చెప్పాలని హుకుం జారీ చేసింది. వాళ్లెవరో కార్ల రేసు నిర్వహిస్తుంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంటల్ ఆథారిటీ (హెచ్ఎండీఏ) నుంచి నిధులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని ప్రశ్నించింది. ఈమేరకు 350 నెంబర్ పేరిట మెమో ఇచ్చింది. అందులో 8 ప్రశ్నలు సంధించింది రాష్ట్ర ప్రభుత్వం.

అరవింద్ ని ప్రభుత్వం ఏమడిగిందంటే...


నిబంధనలకు విరుద్ధంగా ఫార్ములా ఇ కి సంబంధించి ఓ ప్రైవేటు సంస్థతో ఎందుకు త్రైపాక్షిక ఒప్పందం చేసుకోవాల్సివచ్చింది? ప్రభుత్వంతో సంప్రదించకుండా హెచ్ఎండీఏ ఎందుకు ప్రమోటర్ అవతారం ఎత్తింది? ఎన్నికల నిబంధనావళి అమల్లోకి వచ్చిన తర్వాత ఫార్ములా-ఇ సంస్థ (ఎఫ్ఇవో)తో రివైజ్డ్ అగ్రిమెంటు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? హెచ్ఎండీఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల అనుమతి గానీ రాష్ట్రప్రభుత్వ ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ అనుమతి గానీ లేకుండానే 46 కోట్ల రూపాయల ఆర్ధిక భారాన్ని, 9 కోట్ల రూపాయల పన్నును ఎందుకు చెల్లించాల్సి వచ్చింది? వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని లేకుంటే తదుపరి చర్యకు పూనుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఉత్తర్వులు ఇచ్చారు.

అరవింద్ కే నోటీసులు ఎందుకిచ్చారు?


అందరికి తెలిసిన సత్యమే. నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. ఆయన ఇలాకాలో అరవింద్ కుమార్ ఆడింది ఆట, పాడింది పాట. కేటీఆర్ ఏమి చెబితే అది చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో కేటీఆర్ మాటకు ఎదురుండేది కాదు. అలా ఆయనే నెంబర్ టూగా ఉన్నారు. సరిగ్గా ఈ దశలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడింది. కాంగ్రెస్ వచ్చింది. కేటీఆర్ ను అవినీతిపరుడని తేల్చాలంటే ముందు ఆయన కింద పని చేసిన ఐఎఎస్ లకు నోటీసులు ఇచ్చి చట్రంలో ఇరికిస్తే అన్నీ బయటకు వస్తాయన్నది కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన. ఇప్పుడదే జరిగిందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులోకి జగన్ ప్రభుత్వం లాక్కొచ్చింది ఇలాగే.. ముందు సంబంధిత అధికారులకు మెమోలతోనే స్కాంను స్టార్ట్ చేస్తారు. అది ఆ తర్వాత వాళ్లకు ఉచ్చు బిగిస్తుంది.

ఎవరీ అరవింద్ కుమార్?


1991వ సంవత్సరం బ్యాచ్ కి చెందిన అరవింద్ కుమార్ సివిల్ సర్వెంట్. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS)లో 1991 నుంచి పని చేస్తున్నారు. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించిన ఆయన ఉమ్మడి రాష్ట్రంలోనూ వివిధ హోదాల్లో పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ గా పని చేశారు. 55 ఏళ్ల అరవింద్ కుమార్ రెండు దశాబ్దాలకు పైగా పూర్వపు ఆంధ్ర ప్రదేశ్, ప్రస్తుత తెలంగాణాలో వివిధ హోదాల్లో పని చేసిన అనుభవం ఉంది. కేంద్ర ప్రభుత్వంలో 2009-14 మధ్య ఆర్థిక మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. బీమా, బ్యాంకింగ్ రంగాలపై మంచి పట్టున్న అరవింద్ కుమార్ ను ప్రభుత్వం నాబార్డ్, ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్, ది న్యూ ఇండియా బోర్డులలో డైరెక్టర్‌గానూ నామినేట్ చేసింది. అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL), SIDBI, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (NHB), IRDAలోనూ పని చేశారు. అరవింద్ కుమార్ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేశారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ అభివృద్ధి సంస్థ కమిషనర్ గా, మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, మహాత్మ గాంధీ యూనివర్సిటీకి వీసీగా కూడా పని చేశారు. పరిశ్రమలు, వాణిజ్యం, మైనింగ్, టెక్స్‌టైల్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా ఉన్నారు. 2015 జనవరి నుంచి 2017 జనవరి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో నూతన పారిశ్రామికాభివృద్ధి విధానాన్ని అమలు చేశారు. TS IPASS ముసాయిదా రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. అరవింద్ కుమార్ ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. అహ్మదాబాద్ IIM నుంచి MBA పట్టా పొందారు. అరవింద్ కుమార్ వుడ్రో విల్సన్ స్కూల్ నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ చేశారు. అమెరికాలోని ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ నుంచి రాబర్ట్ మెక్‌నరామా స్కాలర్‌గా కోర్సు కూడా చేశారు. బ్రిటన్ రాజధాని లండన్ లో లీడర్‌షిప్, గ్లోబలైజేషన్ పై అధ్యయనం చేసి వచ్చారు. అటువంటి సీనియర్ ఐఎఎస్ అరవింద్ కుమార్ ను కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి అయ్యాక తన పేషీలోకి తెచ్చుకున్నారు.

అసలేమిటీ రేస్?

హైదరాబాద్‌లో ఫార్ములా– ఈ కార్‌ రేసింగ్‌ పోటీలను (రేస్‌ రౌండ్‌ –4) రద్దు చేసినట్లు ఫార్ములా–ఈ ఆపరేషన్స్‌ (ఎఫ్‌ ఈఓ) ప్రకటించింది. వచ్చే ఫిబ్రవరి 10వ తేదీన నెక్లెస్‌రోడ్డు స్ట్రీట్‌ సర్క్యూట్‌లో నిర్వహించవల సిన ఈ అంతర్జాతీయ పోటీలపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఫార్ములా–ఈ పోటీలపై గతేడాది అక్టోబర్‌ 30వ తేదీన ఏర్పాటు చేసుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం ఉల్లంఘించిందని ఆరోపించింది. ఈ మేరకు తెలంగాణ పురపాలన, పట్టణా భివృద్ధి (ఎంఏయూడీ) విభాగానికి నోటీసులు ఇవ్వను న్నట్లు ఎఫ్‌ఈఓ తెలిపింది. ఫార్ములా–ఈ పోటీల వల్ల ఎలాంటి ప్రయోజ నం లేదని భావించడం వల్లే ప్రభుత్వం విముఖతతో ఉన్నట్లు తెలిసింది.

గతంలో వంద కోట్ల ఖర్చు...

ప్రపంచవ్యాప్తంగా మోటార్‌ స్పోర్ట్స్‌ ప్రియు¬ల¬ను విశేషంగా ఆకట్టుకొనే ఫార్ములా–ఈ పోటీలు గత సంవత్సరం ఫిబ్రవరి 10, 11 తేదీల్లో హైద రాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులో జరి¬గాయి. ఈ పోటీల కోసం హెచ్‌ఎండీఏ సుమారు రూ.100 కోట్లకు పైగా వెచ్చించి స్ట్రీట్‌ సర్క్యూట్‌ నిర్మాణంతో పాటు అన్ని ఏర్పాట్లు చేసింది.

ట్రాఫిక్‌ ఇబ్బందులు చెప్పనలవి కాదు...

ఫార్ములా–ఈ పోటీలతో పాటు అంతకంటే రెండు నెలల ముందు జరిగిన ఒక రోజు ఇండియన్‌ రేసింగ్‌ కార్‌ పోటీల సందర్భంగా నగ రంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఐదు రోజుల ముందు నుంచే ట్రాఫిక్‌ ఆంక్షలు విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పోటీలపై సామాజిక మాధ్యమాల్లో పెద్దయెత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రజలకు ట్రాఫిక్‌ నరకాన్ని చూపుతూ ఎవరి కోసం ఈ పోటీలు అంటూ నెటిజన్‌లు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్‌ ప్రభుత్వం వెనుకడుగు వేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇది దుర్మార్గమైన తిరోగమన చర్య: కేటీఆర్‌


ఫార్ములా –ఈ రేస్‌కు ప్రభుత్వం వెనుక¬డుగు వేయడంపై బీఆర్‌ఎస్‌ కార్య¬నిర్వాహక అధ్య క్షుడు కేటీఆర్‌ తీవ్రంగా మండిపడ్డారు. ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వ దుర్మార్గమైన, తిరోగ మన నిర్ణయమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ‘హైదరాబాద్‌ ఇ– ప్రిక్స్‌ వంటివి ప్రపంచవ్యాప్తంగా మన నగరం, దేశం బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచుతాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో హైదరాబాద్‌ నగరాన్ని ఆకర్షణీయమైన పెట్టుబడులకు గమ్యస్థానంగా ప్రపంచానికి చాటేందుకు ఉపకరిస్తాయి. ఎలక్ట్రానిక్‌ వాహన రంగానికి చెందిన ఔత్సాహికులు, తయారీ¬దారులు, స్టార్టప్‌లను ఆకర్షిస్తూ ఒక వారం పాటు ఈవీ సమ్మిట్‌ను నిర్వ హించేందుకు ఫార్ములా–ఈ రేస్‌ను ఒక సందర్భంగా కేసీఆర్‌ ప్రభుత్వం ఉపయోగించుకుంది..’ అంటున్నారు కేటీఆర్‌.

ఇవన్నీ ఎలా చిక్కులన్నీ ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్ కి వచ్చాయి. ఆయన్ను హెచ్ఎండీఎ నుంచి తప్పించి రెవెన్యూ విభాగం స్పెషల్ సెక్రటరీగా నియమించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల.

Read More
Next Story