రూ.30వేల కోట్ల కుంభకోణంలో తెలంగాణ ప్రాజెక్ట్
తెలంగాణ ప్రభుత్వానికి రూ.35 వేల కోట్ల కుంభకోణానికి సంబంధించి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
తెలంగాణ ప్రభుత్వానికి రూ.35 వేల కోట్ల కుంభకోణానికి సంబంధించి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్(పీఆర్ఎల్ఐఎస్) ప్రాజెక్ట్‌లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలకు సంబంధించి కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఒరిజినల్ దస్త్రాలను కోర్టు ముందు ఉంచాలంటూ తెలంగాణ ప్రభుత్వంతో పాటు భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(BHEL)కు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్‌లో అధికారులు, కాంట్రాక్టర్లు అవినీతికి పాల్పడ్డారంటూ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిన్ సంజయ్ కుమార్‌ల ధర్మాసనం డిసెంబర్ 18న ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో ప్రాజెక్ట్ వ్యయ అంచనాలకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను అందించాలని తెలిపింది. దీంతోపాటుగా మేఘా ఇంజేనీరింగ్ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌తో భెల్‌కు ఉన్న జాయింట్ వెంచర్ ఒప్పందానికి సంబంధించిన దస్త్రాలు, ఈ ప్రాజెక్ట్‌కు అందించిన పరికరాలు, చేసిన లావాదేవీలకు సంబంధించిన అన్ని రికార్డ్‌లను కూడా సబ్‌మిట్ చేయాలని న్యాయస్థానం తెలిపింది.
శ్రీశైలం ప్రాజెక్ట్ రిజర్వాయర్ నుంచి 60 రోజుల పాటు 90 వేల మిలియన్ క్యూబిక్‌ల వరద నీటిని ఎత్తిపోసేందుకు ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేయబడింది. 12.3 లక్షల ఎకరాల భూమిని శశ్యశ్యామలం చేయడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. ఈ ప్రాజెక్ట్‌ను 16 సెప్టెంబర్ 2023లో ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్‌పై 2017లో నాగం జనార్థన్ రెడ్డి.. తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. భెల్, మేఘా జాయింట్ వెంచర్‌కు కాంట్రెక్ట్ ఇవ్వడాన్ని సవాల్ చేశారు. వీటికి ప్రాజెక్ట్ ఇవ్వడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.2వేల కోట్ల నష్టం వాటిల్లిందని ఆయన తన పిల్‌లో ఆరోపించారు. ఈ ప్రాజెక్ట్‌లో వినియోగించే పరికరాల విలువను రూ.5,960 కోట్ల నుంచి రూ.8,386 కోట్లకు అక్రమంగా సవరించారని ఆయన ఆరోపించారు. అయితే ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా రాజకీయ పార్టీలకు కీలకమైన సహకారం అందించిన సంస్థగా భెల్ వార్తల్లో నిలిచింది.
ఈ ప్రాజెక్ట్‌కు అందించిన పనిముట్ల వ్యయాన్ని రూ.5,960 కోట్ల నుంచి సరైన విధివిధానాలు పాటించకుండా అక్రమంగా రూ.8,386.86 కోట్లకు సవరించారని, తద్వారా రూ.2,426.07 కోట్ల నష్టం వాటిల్లిందని జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఈఎస్‌సీఐ అంచనా స్వీకరించిన రోజుల వ్యవధిలోనే ఈ సవరణ జరిగిందని, ఆ తర్వాత కొంతకాలానికే ఈ ప్రాజెక్ట్ టెండర్లు టెక్నికల్ అనుమతి పొందిందాయని వివరించారు. ‘‘రూ.2,426 కోట్ల వ్యవ సవరణ ఎటువంటి పరిశీలన లేకుండా పెంచబడిందని ఆర్‌టీఐ అందించిన రిపోర్ట్‌లో ఉంది’’ అని జనార్ధన్ రెడ్డి వెల్లడించారు.
ఈ ప్రాజెక్ట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత శాఖ.. ధరలను ఫిక్స్ చేయడానికి అనైతిక మార్గాలను అనుసరించకుండా ఉండాల్సిందని, దానికి బదులుగా పరికరాల స్పెసిఫకేషన్స్‌కు తగ్గ కాంట్రాక్ట్ పొందడానికి జాతీయ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో కొటేషన్స్‌కు పిలుపినిచ్చి ఉండాల్సిందని జనార్ధన్ సూచించారు. అంతేకాకుండా చేసిన పని కన్నా అధికంగా నగదు రావడంతో ప్రైవేటు కంపెనీకి లబ్ధి చేకూర్చేలా మెఘా, భెల్ మధ్య జాయింట్ వెంచర్ డిజైన్ చేయబడిందని ఆరోపించారు.
జనార్ధన్ రెడ్డి దాఖలు చేసిన పిల్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. ఆయనను సుప్రీంకోర్టును ఆశ్రయించాలని చెబుతూ పిల్‌ను కొట్టివేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విచారణలో భాగంగా ఇదే ప్రాజెక్ట్‌కు సంబంధించి జనార్ధన్ రెడ్డి వేసిన కొన్ని పిల్స్.. ఇంకా హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని, కాబట్టి సుప్రీంకోర్టుకు ఆయన చేస్తున్న అభ్యర్థిన సరైనది కాదని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. దీనిపై స్పందించిన జనార్ధర్ రెడ్డి కౌన్సిల్.. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిల్ కేవలం ప్రాజెక్ట్‌లో జరిగిన అవినీతికి సంబంధించినదేనని, ఈ విషయాన్ని హైకోర్టు పరిశీలించలేదని వివరించింది.
ఈ కేసు విచారణలో భాగంగా ప్రాజెక్ట్‌కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను సమర్పించాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కేసు ముందుకు నడిచేందుకు అన్ని దస్త్రాలను రాష్ట్ర ప్రభుత్వం, భెల్, మేఘా జాయింట్ వెంచర్ అందించాలని ఆదేశించింది.