విద్యుత్ కొనుగోలులో తెలంగాణకు రూ.6,000 కోట్ల నష్టం
x

విద్యుత్ కొనుగోలులో తెలంగాణకు రూ.6,000 కోట్ల నష్టం

ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ)పై మాజీ సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలను అధికారులు తోసిపుచ్చారు.


ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ)పై మాజీ సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలను అధికారులు తోసిపుచ్చారు. విద్యుత్ కొనుగోలులో తెలంగాణకు రూ.6,000 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్‌సీ) పీపీఏను కూడా ఆమోదించలేదని అధికారులు తెలిపారు.

అయితే 2017 చివరి నాటికి ఛత్తీస్‌గఢ్‌తో పీపీఏ పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చినప్పటికీ 1,000 మెగావాట్ల విద్యుత్ సరఫరా పూర్తి కాలేదని అధికారులు తెలిపారు. దీంతో తెలంగాణ మార్కెట్ నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి వచ్చిందని, ఫలితంగా 2017 నుంచి 2022 మధ్య కాలంలో రూ.2,083 కోట్ల అదనపు వ్యయం అయిందని అధికారులు తెలిపారు.

గత BRS ప్రభుత్వం యూనిట్‌కు రూ. 3.90 చొప్పున విద్యుత్‌ను కొనుగోలు చేసినట్లు క్లెయిమ్ చేసింది. కానీ వాస్తవానికి ఇతర ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే యూనిట్‌కు రూ. 5.64 ఖర్చు చేసింది. పీపీఏలపై సైన్ చేసిన తర్వాత, తెలంగాణ 2017 నుండి 2022 మధ్య రూ. 7,719 కోట్లకు 17,996 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను కొనుగోలు చేసింది. ఛత్తీస్‌గఢ్‌కు బకాయిలు రూ.1,081 కోట్లుగా ప్రభుత్వం క్లెయిమ్ చేయగా, విద్యుత్ సరఫరాకు ట్రాన్స్‌మిషన్ ఛార్జీ రూ.1,362 కోట్లు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే ఒక్కో యూనిట్ వ్యయం రూ.5.64కు చేరింది. యూనిట్‌కు అంగీకరించిన రూ.3.90 ధర కంటే ఇది రూ.3,110 కోట్లు ఎక్కువ అని అధికారులు వెల్లడించారు.

కాగా, రెండు రోజుల క్రితం పీపీఏలపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ (సీఓఐ)పై లేఖ ద్వారా దాడి చేశారు. చీఫ్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ చట్టవిరుద్ధంగా అభివర్ణించారు. విచారించడం చేతకాకపోతే కమిషన్ ఛైర్మన్ బాధ్యతల నుండి వైదొలగాలంటూ నరసింహారెడ్డికి సూచించారు. అంతేకాదు టీఎస్‌ఈఆర్‌సీ ఆమోదించిన తర్వాత పీపీఏ పవర్ ప్లాంట్ నిర్మాణ సమస్యలను చూసే అధికారం ఆయనకి లేదని కేసీఆర్ పేర్కొన్నారు.

Read More
Next Story