నీట్ పేపర్ లీక్ పై సీబీఐ విచారణ జరపాలి -మంత్రి దుద్దిళ్ల
x

నీట్ పేపర్ లీక్ పై సీబీఐ విచారణ జరపాలి -మంత్రి దుద్దిళ్ల

దేశవ్యాప్తంగా దుమారం రేపుతోన్న నీట్ అంశంపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పందించారు.


దేశవ్యాప్తంగా దుమారం రేపుతోన్న నీట్ అంశంపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పందించారు. నీట్ ఎగ్జామ్ నిర్వహణ, ఫలితాల అంశంలో చాలామంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని అన్నారు. ఈ వ్యవహారంపై కేంద్రం వెంటనే స్పందించి బాధ్యత గల అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నీట్ అవకతవకలపై సీబీఐ విచారణ చేపట్టాలని కోరారు. విద్యార్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నీట్ పరీక్ష నిర్వహణలో ఎన్డీఏ సర్కార్ దారుణంగా ఫెయిల్ అయిందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. నీట్ పై నమ్మకం కలిపించేలా వ్యవహరించాల్సిన అవసరం కేంద్రం ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.

ప్రశ్నాపత్రం లీక్ వాస్తవమే...

బీహార్‌లో ప్రశ్నపత్రం లీకైందని పోలీసులు కనిపెట్టారు. అరెస్టయిన నలుగురిలో నీట్ అభ్యర్థి అనురాగ్ యాదవ్, అతని మామ సికందర్ ప్రసాద్ యాదవెందు, నితీష్ కుమార్, అమిత్ ఆనంద్ ఉన్నారు. నితీష్, అమిత్ నుంచి యాదవెందు ప్రశ్నపత్రాన్నిసంపాదించాడని సమాచారం. ‘‘పరీక్షకు ముందు రోజు నా మేనమామ నుంచి నాతో పాటు మరో ముగ్గురు అభ్యర్థులు ప్రశ్నాపత్రాన్నితీసుకున్నారు. పరీక్ష తర్వాత పోలీసులు వచ్చి నన్ను ప్రశ్నించడంతో నేరాన్ని అంగీకరించాను’’ అని అనురాగ్ యాదవ్ చెప్పారు.

"ఏ పోటీ పరీక్ష ప్రశ్నపత్రానయినా లీక్ చేస్తాం. NEET పేపర్ కావాలనుకున్న వారి నుంచి రూ. 30 లక్షల నుంచి రూ. 32లక్షలు వసూలు చేస్తాం" అని నితీష్, అమిత్ నాతో చెప్పారని అనురాగ్ యాదవ్ మామ యాదవెందు పోలీసులకు చెప్పారు. యాదవెందు దానాపూర్ మునిసిపల్ కౌన్సిల్‌లో జూనియర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. నీట్ పరీక్ష రాసే ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 10 లక్షలు వసూలు చేసినట్లు యాదవెందు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. పరీక్ష ముగిసిన మరుసటి రోజు.. వాహన తనిఖీలో విద్యార్థుల అడ్మిట్ కార్డులను యాదవెందు నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read More
Next Story