44 యేళ్ల తర్వాత ఇంద్రవెల్లిలో  వీచిన స్వేచ్ఛా వాయువులు...
x

44 యేళ్ల తర్వాత ఇంద్రవెల్లిలో వీచిన స్వేచ్ఛా వాయువులు...

ప్రభుత్వ తరఫున ఇంద్రవెళ్లి గిరిజన అమరవీరులకు నివాళులర్పించిన మంత్రి సీతక్క


-వంగల సంతోష్

ఇంద్రవెల్లి అనగానే నాలుగునర దశాబ్దాల కిత్రం జరిగిన సంఘటన గుర్తుకు వస్తుంది. ఇంతకీ ఇంద్రవెల్లిలో ఏం జరిగింది? ఎందుకు ఇంద్రవెల్లిని పాలకులు ప్రతి సారి తమ ఎన్నికల ప్రచారంలో వాడుకుంటారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం.

ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినాన్ని ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా నిర్వహించింది. ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులర్పించడంపై 44 ఏళ్లుగా ఉన్న నిషేధం, నిర్భందాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తేసింది. తెలంగాణ రాష్ట్రం సిద్దించడంతో ఆంక్షలను సడలించినా అధికారికంగా ఇలాంటి సంస్మరణ కార్యక్రమం భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం జరపలేదు. అమర వీరుల సంస్మరణ దినోత్సవం జరపాలన్న ఆదివాసీ సంఘాల విజ్ఞప్తుల మేరకు ఎట్టకేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ సంస్మరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు ముందుకు వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ లోని అమరవీరుల స్థూపం వద్ద ఏప్రిల్ 20న అమర వీరుల సంస్మరణ కార్యక్రమంలో ఇంఛార్జ్ మంత్రి ధనసరి సీతక్క పాల్గొన్నారు.

ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో గిరిజన అమరవీరులకు నివాళులర్పిస్తున్న గిరిజనులు

ఇంద్రవెల్లి సంఘటన ఏమిటి?

అది 1981 ఏప్రిల్ 20 న ఇంద్రవెల్లిలో ఆదివాసీ ప్రజలతో సభ నిర్వహించాలనుకున్నా రోజు. ఈ సభ ముఖ్య ఉద్దేశం ఆదివాసీ గూడాలో జరుగుతున్న దోపిడీ,భూస్వామ్య పీడనల విధానంపై గొంతు విప్పడం,అడవిపై హక్కు ఆదివాసులదే అంటూ నాటి రైతు కూలీ సంఘం ఇంద్రవెల్లి చుట్టూ పక్కల గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారానికి వాళ్లకు మైకులు కూడా లేవు.కేవలం వారు నోటితో పాటు,పాడుకుంటూ,ప్రచారం చేస్తున్నారు.ఆదివాసీ గూడాలో,ఇంద్రవెల్లి చుట్టూ పక్కల గూడాలో ప్రచారం జరిగింది.సభకు నాటి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది.అయితే ప్రచారం జరిగిన తీరును గమనించిన ప్రభుత్వం,ఇంద్రవెల్లి మరో సిరిసిల్ల- జగిత్యాల జైత్రయాత్రగా మారుతుందేమోనని ఊహించి సభ పర్మిషన్ రద్దు చేసింది.అప్పటికే సిరిసిల్ల జగిత్యాల కల్లోలిత ప్రాంతాలుగా (Area Disturbance Act 1978, October 20) అక్టోబర్ 20,1978 లో ప్రకటించింది.ప్రభుత్వం భావించినట్లుగానే ఇంద్రవెల్లి విప్లవాపథంగా గా మారింది.

ప్రభుత్వం పర్మిషన్ రద్దు వార్త తెలియకుండానే ఆదివాసీ గూడాల నుండి జనం కదిలారు. సభ ప్రాంగణనికి వాగులు,వంకలు,చెట్టు చేమలు, అన్ని దాటుకుంటూనే ప్రజలు చీమల దండుగా ముందుకే సాగారు.అప్పటికే పోలీసు యంత్రాంగం మైకుల ద్వారా సభ పర్మిషన్ రద్దు చేశామని చెబుతున్న,ఆ భాష వారికి అర్థం కావడం లేదు.ఈ రోజు జరిగే సభతో ఆదివాసీ గూడాల్లో జరుగుతున్న అన్యాయం తొలిగిపోయి జల్-జంగల్ -జమీన్ ల మీద హక్కు మాదే అనుకుంటున్న ఆదివాసులపై పోలీసులు కాల్పుల మోత మోగించారు.పచ్చని అడవి నెత్తురు ఏరులు పారింది.ఇది తెలంగాణలో జరిగిన మరో జలియన్ వల్లభాగ్.ఈ కాల్పుల్లో చనిపోయిన వారి సంఖ్యను దాచి దొంగలెక్కులు చెప్పింది.కేవలం పద మూడు (13) మంది మాత్రమే అంటూ నిస్సిగ్గుగా చెప్పింది.ఇప్పటికీ ఎందరో పాలకులు మారిన ఇంద్రవెల్లిలో నాడు జరిగిన దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు న్యాయం చెయ్యలేదు,జరగను లేదు.పౌర హక్కుల,ప్రజా సంఘాలు మాత్రమే నాడు జరిగిన ఉద్దంతాన్ని స్పష్టంగా లెక్కలతో చెప్పారు.

ఇంద్రవెల్లి అమరుల గుర్తుగా స్థూపాన్ని నిర్మించారు.ప్రతి ఏటా అక్కడ వారికి నివాళ్లు అర్పిస్తారు.ఇది గమనించిన పాలక ప్రభుత్వాలు మళ్లీ ప్రజలు తిరగబడుతారో అని ఏప్రిల్ 20 న ఆంక్షలతో కూడిన నివాళ్లను అర్పించేలాగా,అక్కడి ప్రజల్లో భయానక వాతావరణాన్ని సృష్టించే విధానం కొనసాగిస్తూ వచ్చింది.కొద్ది కాలానికి మార్చి 19,1986 లో ఇంద్రవెల్లి స్థూపాన్ని కూల్చారు. దీనితో ప్రజలు,పౌర సంఘాల ఒత్తిడితో తిరిగి ఐటీడీఏ నిధులతో 1987 లో స్థూపాన్ని నిర్మించింది.

ఎన్నికల వేల పాలకులు ఇంద్రవెల్లి మీద ఎన్నో ప్రేమలు కురిపిస్తారు.అధికారంలోకి వచ్చాక అన్ని ఉత్తి మాటలుగానే మిగులుతున్నాయి.తెలంగాణ స్వరాష్ట్రం వచ్చాక స్వేచ్ఛ వాయువులు వీస్తాయని అనుకున్న కానీ ఆదివాసీ గూడాల్లో ఆ స్వేచ్ఛ లేదు.గత KCR ప్రభుత్వంలో కూడా ఇంద్రవెల్లిలో స్వేచ్ఛగా అమరులకు నివాళులు అర్పించే విధానం లేకుండా పోయింది.ఏ ప్రభుత్వాలైన దోపిడీ సాధనాలను కొనసాగించేవే కానీ ప్రజలకు అనుకూలంగా పాలనను కొనసాగించలేవు. కదా.కాంగ్రెస్ తమ ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి వస్తే ఇంద్రవెల్లిలో అమరుల స్మారకంగా స్మృతి వనం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. కనీసం గత పాలకులకు భిన్నంగానైనా రేవంత్ సర్కార్ ఇంద్రవెల్లిలో సభ నిర్వహించుకోవడానికి అనుమతినిచ్చింది.

అయితే...

నిన్నటి ఇంద్రవెల్లి సభలో ప్రతి యేడు లాగా ఆదివాసీ సంప్రదాయ పద్ధతిలో నివాళి అర్పించడం జరగలేదు.వేదిక మీదకు పాలక పక్ష నాయకులతో నిండి పోయింది.ఆదివాసీ సంఘాల నాయకులు,సామాజిక కార్యకర్తలకు చోటు కల్పించలేదు. నాటి అమరుల కుటుంబాలకు సహాయం చేశారు.ట్రాక్టర్,బొలెరో ను రాయితీ కిందా ఇచ్చారు.ఈ వేదిక మీదనే ఇంద్రవెల్లి ఆ గాయానికి 44 ఏండ్లు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.

కేవలం ఇంద్రవెల్లి అమరులకు నివాళితో ఆగకుండా, పౌర,ప్రజాస్వామ్యం రక్షణలో భాగంగా మేధావులు కోరుతున్నట్లు నక్సల్ తో శాంతి చర్చలు జరిపేందుకు బాట వేయాలి.


Read More
Next Story