
సద్దుల బతుకమ్మకు సన్నద్దమవుతున్న హైదరాబాద్..
ట్రాఫిక్ మార్గదర్శకాలు విడుదల చేసిన తెలంగాణ పోలీస్ శాఖ.
సద్దుల బతుకమ్మ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భారీగా సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసు శాఖ ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. సెప్టెంబర్ 30 మంగళవారం నాడు సరూర్ నగర్ స్టేడియంలో జరిగే సద్దుల బతుకమ్మ సంబరాల కోసం ప్రధానంగా ట్యాంక్ బండ్, నెక్లెస్‌రోడ్ ప్రాంతాల్లో ఆంక్షలను విధిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అమరవీరుల స్మారక స్థూపం నుండి బతుకమ్మ ఘాట్ వరకు మంగళవారం మధ్యామ్నం రెండు గంటల నుంచి రాత్రి పడకొండు గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఈ క్రమంలోనే ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేశారు.
ప్రత్యామ్నాయ మార్గాలివే..
- తెలుగు తల్లి జంక్షన్, కర్బలా మైదాన్ నుండి ట్యాంక్ బండ్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్ను రేపు మధ్యాహ్నం 2.00 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు అనుమతించరు.
- ఇక్బాల్ మినార్ నుండి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ను తెలుగు తల్లీ ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ ప్రారంభం నుంచే కట్ట మైసమ్మ, డా. బీఆర్ అంబేద్కర్, ఇందిరా పార్క్, గాంధీనగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ మీదుగా మళ్లిస్తారు.
- V.V. విగ్రహం నుండి ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే ట్రాఫిక్ను ఇందిరా గాంధీ విగ్రహం (నెక్లెస్ రోటరీ) వద్ద ప్రసాద్ హైమాక్స్, మింట్ కాంపౌండ్ లేన్ వైపు మళ్లిస్తారు.
- నల్లకుంట జంక్షన్ నుండి బుద్ధ భవన్ వైపు ట్రాఫిక్ను అనుమతించరు. అటు నుంచి వచ్చే వారిని నల్లకుంట X-క్రాస్ రోడ్, రాణిగంజ్ మీదుగా నెక్లెస్ రోడ్ వైపు మళ్లిస్తారు.
- లిబర్టీ నుండి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ను అంబేద్కర్ విగ్రహం వద్ద ఇక్బాల్ మినార్ 'యు' టర్న్ నుంచి తెలుగు తల్లీ జంక్షన్ నుంచి తెలుగు తల్లీ ఫ్లైఓవర్ వైపు మళ్లించబడుతుంది.
- సికింద్రాబాద్ నుండి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ను కర్బలా మైదాన్ వద్ద బైబిల్ హౌస్-జబ్బార్ కాంప్లెక్స్-కవాడిగూడ - గాంధీ నగర్ టి జంక్షన్- గోశాల- ధోభి ఘాట్- స్విమ్మింగ్ పూల్- బండ మైసమ్మ- ఇందిరా పార్క్- కట్ట మైసమ్మ, తెలుగు తల్లీ ఫ్లైఓవర్ వైపు మళ్లించబడుతుంది.
- ముషీరాబాద్, కవాడిగూడ నుండి చిల్డ్రన్స్ పార్క్ అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ అనుమతించబడదు. డా బీఆర్ అంబేదక్ర్ మిల్స్ నుంచి MRO ఆఫీస్, ధోభి ఘాట్స్వి, మ్మింగ్ పూల్, బండమైసమ్మ-, ఇందిరా పార్క్క, కట్టమైసమ్మ వైపు మళ్లించబడుతుంది.
Next Story