Telangana Police | తెలంగాణ పోలీసులకు ప్రశంసల వెల్లువ,అవార్డులెన్నో...
2024వ సంవత్సరంలో తెలంగాణ పోలీసులకు ప్రశంసలు వెల్లువెత్తాయి. హైదరాబాద్‌లోని శాలిబండ పోలీసుస్టేషన్ దేశంలోనే 8వ ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా నిలిచింది.
2024వ సంవత్సరంలో తెలంగాణ పోలీసులు మెరుగైన పనితీరు కనబర్చడంతో ప్రశంసలు వెల్లువెత్తాయి. వరద విపత్తుల్లో ప్రజలకు పోలీసులు మెరుగైన సేవలు అందించారు. హైదరాబాద్‌లోని శాలిబండ పోలీసుస్టేషన్ దేశంలోనే 8వ ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా నిలిచింది.
- హైదరాబాద్ నగరంలో పోలీసులు జీఐఎస్ ను ఉపయోగించి గణేష్ నిమజ్జన ప్రక్రియను డిజిటల్ అప్లికేషన్ సాయంతో ట్రాక్ చేశారు. దీనిపై తెలంగాణ పోలీసులు డిజిటల్ అప్లికేషన్అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ డిజిటల్ ఇంజినీరింగ్ అవార్డును కైవసం చేసుకున్నారు.
- సైబర్ నేరాల కోసం అన్ని రాష్ట్రాలను కలుపుతూ కేంద్రీకృత పోర్టల్ రూపొందించినందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ తెలంగాణ పోలీసులకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రశంసాపత్రాన్ని అందజేశారు. తెలంగాణ పోలీసులు ఇ-పెట్టీ కేస్ మొబైల్ యాప్, ఇంటిగ్రేటెడ్ పెట్రోల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్,స్మార్ట్ పోలీసింగ్ కార్యక్రమాల స్కోచ్ అవార్డ్స్ -2024 లభించింది.
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గౌరవం లభించింది.ఎక్సలెన్స్ ఇన్ కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజన్సీస్ నుంచి ఎక్సలెన్స్ అవార్డ్ -2024 లభించింది.
- డిజిటల్ ఎవిడెన్స్ బేస్డ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ద్వారా ప్రజల భద్రతకు తీసుకున్న చర్యలకు ప్రశంసలు లభించాయి.సైబర్ సెక్యూరిటీకి సైబరాబాద్‌లోని సైబర్ క్రైమ్ యూనిట్ అందించిన విశేష సేవలను గుర్తించారు.తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ ప్రతిష్ఠాత్మక గుర్తింపు పొందింది.
- తెలంగాణ పోలీసులకు 805 కమాండేటషన్,52 జాతీయ అవార్డులు లభించాయి.తెలంగాణ పోలీసులకు 1204 పతకాలు, ప్రధానమంత్రి గాలంట్రీ అవార్డు, 448 మెడల్స్ ప్రదానం చేశారు.
Next Story