ఒసాకాలో తెలంగాణ పెవిలియన్ షురూ.. అసలేంటీ ఎక్స్‌పో?
x

ఒసాకాలో తెలంగాణ పెవిలియన్ షురూ.. అసలేంటీ ఎక్స్‌పో?

ఒసాకా ఎక్స్‌పో, జపాన్ లోని ఒసాకా నగరంలో నిర్వహించబడే ప్రపంచ ఎక్స్‌పో. ఇది 2025 లో, ఏప్రిల్ 13 నుండి అక్టోబర్ 13 వరకు జరుగుతుంది.


తెలంగాణకు పెట్టుబడులను తీసుకురావడం కోసం సీఎం రేవంత్ రెడ్డి తన తెలంగాణ రైజింగ్ బృందంతో కలిసి ప్రస్తుతం జపాన్‌లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే దాదాపు రూ.11వేల కోట్ల పెట్టుబడులను ఆయన బృందం ఆకర్షించింది. కాగా ఈ పర్యటనలో భాగంగానే ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్‌ని కూడా ప్రారంభించారు. ఈ ఎక్స్‌పోలో పాల్గొన్న తొలి భారతదేశ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ వేదికపై రాష్ట్ర ప్రత్యేకతలు, పారిశ్రామిక అనుకూలతలు, పర్యటక ఆకర్షణలు సహా తెలంగాణ ఖ్యాతిని చాటిచెప్పేలా పెవిలియన్‌ను డిజైన్ చేశారు. ఈ సమ్మిట్ వేదికగా మరిన్ని ఒప్పందాలపై తెలంగాణ ప్రభుత్వం సంతకాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పలు సంస్థల ప్రతినిధులతో సీఎం రేవంత్, ఆయన బృందం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం నుంచి సీఎం రేవంత్ రెడ్డి.. హిరోషిమా పర్యటనకు వెళ్లనున్నారు. ఆ సమయంలో ఆయన బృందం ఒసాకా సమ్మిట్‌లో పాల్గొననుంది.

ఎక్స్‌పో లక్ష్యం ఇదే..

ఒసాకా ఎక్స్‌పో, జపాన్ లోని ఒసాకా నగరంలో నిర్వహించబడే ప్రపంచ ఎక్స్‌పో. ఇది 2025 లో, ఏప్రిల్ 13 నుండి అక్టోబర్ 13 వరకు జరుగుతుంది. ఈ ఎక్స్‌పోలో ప్రపంచవ్యాప్తంగా 160 కంటే ఎక్కువ దేశాలు పాల్గొంటాయి. ఈ ఎక్స్‌పో "భవిష్యత్ సమాజం కోసం డిజైన్" అనే థీమ్ తో నడుస్తుంది. "మానవజాతికి పురోగతి మరియు సామరస్యం" అనే థీమ్‌తో 1970లో జరిగిన ఒసాకా ఎక్స్‌పో తర్వాత, జపాన్లో నిర్వహించబడుతున్న రెండవ వరల్డ్ ఎక్స్‌పో. ఈ ఎక్స్‌పో భవిష్యత్ సమాజం గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి మరియు సాంకేతికత, సంస్కృతి మరియు సాంప్రదాయాలను కలపడానికి ఒక వేదికగా పనిచేస్తుంది.

సరికొత్త టెక్నాలజీని ప్రమోట్ చేయడం, దేశాల మధ్య సాంస్కృతిక, కల్చరల్ పరస్పర మార్పిడిన ప్రోత్సహిస్తుంది. ప్రపంచ సవాళ్ల పరిష్కారాలపై చర్చిస్తుంది. ఈ ‘ప్రజల జీవనాన్ని మెరుగుపరచడానికి ఫ్యూచర్ సిటీని డిజైన్ చేయడం, సరికొత్త ఆవిష్కరణలను ప్రదర్శించడం, ప్రపంచ సవాళ్లను చర్చించడం’ వంటివి ఈ సదస్సు ప్రధాన లక్ష్యం. ఈ సదస్సులో ప్రపంచ దేశాల నుంచి దిగ్గజ వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలు పాల్గొంటారు. కావున పెట్టుబడులను ఆకర్షించడానికి కూడా ఈ సద్దసు మంచి వేదికగా నిలుస్తుంది.

Read More
Next Story