రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది.. పంచాంగ శ్రవణం ఇంకా ఏం చెప్పిందంటే..
x

రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది.. పంచాంగ శ్రవణం ఇంకా ఏం చెప్పిందంటే..

రేవంత్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని చెప్పారు.


ఉగాది పండగను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని రవీంద్ర భారత్‌తో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. అనంతరం అర్చకులు.. భద్రాచలం రాములవారి కళ్యాణానికి రావాలని సీఎం రేవంత్‌ను ఆహ్వానించారు. కళ్యాణ పత్రికను కూడా రేవంత్‌కు అందించారు. అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది. అందులో పండితులు.. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్నారు. రేవంత్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని చెప్పారు.

పండితులు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. ‘‘ఈ ఏడాది తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం పరుగులు పెడుతుంది. తెలంగాణ రాష్ట్రం మిథున రాశి, పునర్వసు నక్షత్రంలో ఆవిర్భవించింది. పాలకుల మధ్య పోటీతత్వం పెరుగుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పాలకులు పోటీపడి పరుగులుపెట్టి పాలిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఏడాది ప్రజలు మెచ్చే విధంగా పాలన చేస్తారు. తెలంగాణలో వర్షాలకు ఇబ్బంది లేదు, పంటలు అద్భుతంగా పండుతాయి. ఎర్రరేగడి భూములు, ఎర్రటి ధాన్యాలు మంచి ఫలితాలు ఇస్తాయి. శాంతి భద్రతల విషయంలో నిరంతరం పోలీసులు జాగృతంగా ఉండి పనిచేస్తారు’’ అని ఆయన చెప్పారు.

Read More
Next Story