తెలంగాణ స్కూల్స్ హాలిడేస్, ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసిందోచ్
తెలంగాణ విద్యా శాఖ స్కూల్స్ అకడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసింది. పాఠశాలల టైమింగ్స్, ఎగ్జామ్స్ షెడ్యూల్, హాలిడేస్ లిస్ట్ ప్రకటించింది.
తెలంగాణ విద్యా శాఖ స్కూల్స్ అకడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసింది. 2024-25 అకడమిక్ ఇయర్ జూన్ 12న మొదలై ఏప్రిల్ 23, 2025 వరకు కొనసాగనుంది. 'బడి బాట' పేరిట జూన్ 1 నుండి 11 వరకు ప్రభుత్వ పాఠశాలల అడ్మిషన్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపింది.
అకడమిక్ క్యాలెండర్ 2024-2025:
ఎగ్జామ్స్ షెడ్యూల్:
ఫార్మేటివ్ అసెస్‌మెంట్ 1 : జూలై 31 వ తేదీకి
ఫార్మేటివ్ అసెస్‌మెంట్ 2 : సెప్టెంబర్ 30 వ తేదీకి
సమ్మేటివ్ అసెస్‌మెంట్ 1 : అక్టోబర్ 21 నుండి 28 వరకు
ఫార్మేటివ్ అసెస్‌మెంట్ 3: డిసెంబర్ 17 వ తేదీకి
ఫార్మేటివ్ అసెస్‌మెంట్ 4: జనవరి 29, 2025 వ తేదీకి పదవ తరగతికి, ఫిబ్రవరి 28, 2025 న 1 నుండి 9 వ తరగతులకు
సమ్మేటివ్ అసెస్‌మెంట్ 2 (1 నుండి 9 తరగతులు) : ఏప్రిల్ 9 నుండి 19, 2025
10 వ తరగతికి ప్రీ-ఫైనల్: ఫిబ్రవరి 28, 2025కి ముందు
SSC బోర్డ్ పరీక్షలు: మార్చి 2025
జనవరి 10, 2025 నాటికి 10 వ తరగతికి సంబంధించిన సిలబస్ పూర్తి
ఫిబ్రవరి 28, 2025 నాటికి 1 నుండి 9 తరగతులకు సిలబస్ పూర్తి
రోజువారీ పాఠశాల అసెంబ్లీలో యోగా, ధ్యానం చేర్చబడ్డాయి.
సెలవులు:
దసరా సెలవులు: అక్టోబర్ 2 నుండి 14 వరకు (13 రోజులు)
మిషనరీ పాఠశాలలకు క్రిస్మస్ సెలవులు: డిసెంబర్ 23 నుండి 27 వరకు
మిషనరీ పాఠశాలలు కాకుండా సంక్రాంతి సెలవులు: జనవరి 13 నుండి 17 వరకు
వేసవి సెలవులు: ఏప్రిల్ 24, 2025 నుండి జూన్ 11, 2025 వరకు
స్కూల్ టైమింగ్స్ :
హై స్కూల్స్ : ఉదయం 9.30 నుండి సాయంత్రం 4.45 వరకు. హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ విషయానికి వస్తే, సమయం ఉదయం 8.45 నుండి సాయంత్రం 4 వరకు
అప్పర్ ప్రైమరీ స్కూల్స్ : ఉదయం 9 నుండి సాయంత్రం 4.15 వరకు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4 గంటల వరకు
ప్రైమరీ స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూళ్ల ప్రైమరీ సెక్షన్స్ : ఉదయం 9 నుండి సాయంత్రం 4 వరకు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో రాత్రి 8.45 నుంచి 3.45 గంటల వరకు సమయం ఉంటుంది.
హై స్కూల్స్ లో పనిచేస్తున్న ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ : ప్రాథమిక పాఠశాలలకు ఉదయం 9.30 నుండి సాయంత్రం 4.15 వరకు మరియు ప్రాథమికోన్నత పాఠశాలలకు ఉదయం 9.30 నుండి సాయంత్రం 4.45 వరకు