ఇంటర్‌లో విద్యార్థుల ఉత్తీర్ణత 71.37శాతం
x

ఇంటర్‌లో విద్యార్థుల ఉత్తీర్ణత 71.37శాతం

సప్లిమెంటరీకి ఏప్రిల్ 23 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఇంటర్‌బోర్డ్ కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు.


తెలంగాణ ఇంటర్ ఫలితాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో 71.37 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కరోనా ఏడాది 2021 తర్వాత ఇంతటి ఉత్తీర్ణత నమోదవడం ఇదే తొలిసారి. ఇంటర్‌మీడియట్ ఫస్ట్ ఇయర్‌లో 66.89శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గతేడాది ఫలితాలతో పోలిస్తే ఈ ఏడాది ఇంటర్‌లో విద్యార్థుల ఉత్తీర్ణత 5.83 శాతం పెరిగింది. అదే విధంగా ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలు 13-14శాతం అధికంగా ఉన్నారని అధికారులు తెలిపారు.

సప్లిమెంటరీకి దరఖాస్తులు షురూ

ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం మే 22 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు చెప్పారు. ఈ సప్లిమెంటరీకి ఏప్రిల్ 23 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఇంటర్‌బోర్డ్ కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. ఈ సప్లిమెంటరీ దరఆస్తుతో పాటు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చని ఆయన చెప్పారు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ చూడాలని తెలిపారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధిస్తే వారు రెగ్యులర్‌గా పాస్ అయినట్లే పరిగణిస్తారని, ఒకసారి తప్పిన వారి జాబితాలో వారి పేరు ఉండదని అధికారులు స్పష్టం చేశారు.

Read More
Next Story