జాతీయ వేదికపై మెరిసిన తెలంగాణ, రాష్ట్రపతి అవార్డులు
x
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డును అందుకుంటున్న కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్

జాతీయ వేదికపై మెరిసిన తెలంగాణ, రాష్ట్రపతి అవార్డులు

గిరిజన సాధికారత కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో మెరిసింది.


దేశంలోనే గిరిజన సాధికారత కార్యక్రమాల్లో అత్యుత్తమ పనితీరు కనబర్చి ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ లో తెలంగాణ మూడవ స్థానాన్ని పొందింది.(Telangana Shines) ఈ అద్భుత విజయానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ ఢిల్లీలో అందుకున్నారు. దీంతోపాటు తెలంగాణలోని గిరిజన సాంస్కృతిక పరిశోధన,శిక్షణ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ పద్మ పి.వి., అసాధారణ కృషికి సూపర్ కోచ్‌లు, రాష్ట్ర మాస్టర్ ట్రైనర్లలో గుర్తింపు పొందారు.


తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ద్వారా యువ శాస్త్రవేత్త అవార్డు పొందిన డాక్టర్ నిరజ


ఐదు జిల్లాల కలెక్టర్లకు జాతీయ అవార్డులు

న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆది కర్మయోగి జాతీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి జన్మాన్, ఆది కర్మయోగి అభియాన్, జనభాగిదారి, ధరతి అభ జన్ భాగిదారి అభియాన్ వంటి వివిధ కార్యక్రమాల కింద ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, జిల్లాలు, బ్లాక్‌లు,అధికారులను రాష్ట్రపతి సత్కరించారు.తెలంగాణ కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో అవార్డులు లభించాయి.(TelanganaRising)ఆది కర్మయోగి అభియాన్ కింద ఆదిలాబాద్, నల్గొండ,ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లకు అవార్డులు లభించాయి.

తెలంగాణ గురుకులాలకు గర్వకారణం డాక్టర్ నీరజ సిన్హా

తెలంగాణ గురుకులాల సంస్థలో పనిచేస్తున్న డాక్టర్ నీరజ సిన్హా (Dr.Neeraja Sinha)రెండు అత్యుత్తమ అవార్డులను సాధించి గురుకులాలకే గర్వకారణంగా నిలిచారు. తెలంగాణ గురుకుల సొసైటీలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా (ఓఎస్డీగా) పనిచేస్తున్న డాక్టర్ నిరజ తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ద్వారా యువ శాస్త్రవేత్త అవార్డు (Young Scientist Award),జర్మనీ ప్రభుత్వం నుంచి అత్యుత్తమ సాధన అవార్డులను అందుకున్నారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో గోల్డ్ మెడలిస్ట్, హైదరాబాద్ ఐఐటీలో పూర్వ విద్యార్థిని అయిన డాక్టర్ నీరజ సిన్హా స్వస్థలం నాగర్ కర్నూల్ జిల్లా సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం నుంచి వచ్చారు. డాక్టర్ నీరజ సాధించిన అసాధారణ విజయం తెలంగాణ గురుకుల సంస్థలకు బలం చేకూరుస్తుందని గురుకులాల సెక్రటరీ సీతాలక్ష్మీ చెప్పారు.


పాఠశాలల విద్యార్థులకు పాలు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం

తెలంగాణలో నర్సరీ నుంచి 4వతరగతి వరకు చదివే పాఠశాలల విద్యార్థులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలతో పాటు పాలు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జూన్ 2026వ సంవత్సరం నుంచి పైలెట్ ప్రాజెక్టు కింద నాలుగు పాఠశాలల్లో ఈ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు.ప్రతీ ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలగా అభివృద్ధి చేసి నాణ్యమైన విద్యను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.


Read More
Next Story