హైదరాబాద్ ‘ఫ్యూచర్ సిటీ’లో పెట్టబడుల జడివాన
x

హైదరాబాద్ ‘ఫ్యూచర్ సిటీ’లో పెట్టబడుల జడివాన

తెలంగాణ రైజింగ్ లో 35 ఒప్పందాలు, రెండున్నర లక్ష లకోట్ల పెట్టుబడులు


తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025తో రాష్ట్ర ప్రభుత్వం రికార్డ్ సృష్టించింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజులో రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడులకు మొత్తం 35 ఎంఓయూలు కుదిరాయి. రాష్ట్ర ఆర్థిక వృద్ధి, ఉద్యోగ సృష్టిలో ఇది కీలక మైలురాయిగా ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ సమిట్‌లో డీప్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, డిఫెన్స్, అడ్వాన్స్‌డ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో భారీ పెట్టుబడులు ప్రకటించబడ్డాయి.

అన్నింటికంటే ముఖ్యమయిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కంపెనీల నుంచి వచ్చిన ప్రకటన. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్వైడర్ ఆయన ప్రతినిధిగా సమ్మిట్ కు హాజరయ్యారు. తెలంగాణ ఈ గ్రూప్ 10బిలియన్ డాలర్ల పెట్టుబడులు అంటే ఒక లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు ప్రకటించారు.

తొలి రోజు కుదిరిన ప్రధాన ఎంవోయూలు:

రూ.1,04,000 కోట్లు — డీప్ టెక్ & ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులు

రూ.75,000 కోట్లు: గ్లోబల్ డీప్‌టెక్ ఇన్నొవేషన్ సిటీ (బ్రూక్‌ఫీల్డ్/యాక్సిస్)

రూ.27,000 కోట్లు: విన్ గ్రూప్ రిన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు & EV ఇన్ఫ్రా

రూ.1,000 కోట్లు: SIDBI స్టార్టప్ ఫండ్

రూ.1,000 కోట్లు: వాక్ టు వర్క్ మోడల్‌తో WTC ఇన్నొవేషన్ హబ్

రూ.39,700 కోట్లు — గ్రీన్ ఎనర్జీ మరియు ఎనర్జీ ట్రాన్సిషన్

రూ.31,500 కోట్లు: సోలార్ మరియు విండ్ మెగా ప్రాజెక్టులు

రూ.8,000 కోట్లు: మెయిల్‌ (MEIL) సోలార్, PSP మరియు EV మొబిలిటీ ప్రాజెక్టులు

రూ.19,350 కోట్లు — ఏరోస్పేస్, డిఫెన్స్ & లాజిస్టిక్స్

రూ.15,000 కోట్లు: GMR హబ్ విస్తరణ

రూ.5,000 కోట్ల దాకా: డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు

MPL & TVS ILP: కొత్త లాజిస్టిక్స్ వృద్ధి కేంద్రాలు

రూ.13,500 కోట్లు — అడ్వాన్స్‌డ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ & ఇండస్ట్రియల్ ప్రాజెక్టులు

రూ.7,000 కోట్లు: ఎలక్ట్రానిక్స్ మరియు హైడ్రోజన్ టెక్నాలజీలు

రూ.5,000 కోట్లు: ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్

రూ.3,000 కోట్లు: సీతారాం స్పిన్నర్స్ టెక్స్టైల్ యూనిట్

రూ.960 కోట్లు: టెక్నికల్ టెక్స్టైల్స్ (సొలాపూర్ టెక్స్టైల్ అసోసియేషన్ & జీనియస్ ఫిల్టర్స్)

అధికారుల ప్రకారం, ఈ పెట్టుబడులు టెలంగాణ విజన్ 2047 లక్ష్యాలను వేగవంతం చేస్తాయి. ముఖ్యంగా డీప్‌టెక్ ఇన్నొవేషన్, పునరుత్పాదక శక్తి, పరిశ్రమీకరణ మరియు భారీ ఉద్యోగావకాశాల సృష్టి పై రాష్ట్రం భారీ అడుగు వేసిందని ప్రభుత్వం పేర్కొంది.

Read More
Next Story