Telangana | తెలంగాణ కేబినెట్ తీర్మానాలివి...
x

Telangana | తెలంగాణ కేబినెట్ తీర్మానాలివి...

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం శనివారం కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ గా అప్ గ్రేడ్ చేసేందుకు కేబినేట్ ఆమోద ముద్ర వేసింది.


పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మాజీ కేంద్రమంత్రి సూదిని జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని తెలంగాణ మంత్రివర్గ సమావేశం తీర్మానించింది.సింగూరు ప్రాజెక్టుకు మంత్రి దామోదర రాజనర్సింహ తండ్రి, దివంగత మంత్రి రాజనర్సింహ పేరు పెట్టాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

- జూరాల నుంచి కృష్ణా జలాలను మహబూబ్ నగర్ జిల్లాలో కొత్తగా మరిత ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఉన్న మార్గాలు, ప్రత్యమ్నాయాలను పరిశీలించేందుకు టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీని నియమించాలని నిర్ణయం తీసుకుంది. ఎక్కడ నీటి లభ్యత ఉంది? ఎక్కడ నుంచి ఎంత నీటిని తీసుకునే వీలుంది? ఎక్కడెక్కడ రిజర్వాయర్లు నిర్మించాలి? ఇప్పుడున్న ప్రాజెక్టులకు మరింత నీటిని తీసుకునే సాధ్యాసాధ్యాలపై కమిటీ అధ్యయనం చేయనుంది.
-మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను హైదరాబాద్ తాగునీటికి తరలించే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్-2, ఫేజ్-3 కి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో 15టీఎంసీలకు ప్రతిపాదించిన ఈ పథకాన్ని భవిష్యత్ అవసరాల దృష్ట్యా 20 టీఎంసీలకు పెంచేందుకు ఆమోదం తెలిపింది.
- కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ గా అప్ గ్రేడ్ చేసేందుకు కేబినేట్ ఆమోద ముద్ర వేసింది.

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి : సీఎం

తెలంగాణలో, హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు పెట్టాలని అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్ లో మూసీ పునరుజ్జీవనం, మెట్రో రైలు విస్తరణ, ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, స్కిల్స్ యూనివర్శిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఈవీ హబ్, గ్రీన్ ఎనర్జీ హబ్, రీజనల్ రింగ్ రోడ్.. ఇలా ఎన్నో గొప్ప ప్రాజెక్టులు చేపడుతున్నామని సీఎం పేర్కొన్నారు.‘‘తెలంగాణకు అత్యధికంగా పెట్టుబడులు రావాలి.. అభివృద్ధి జరగాలి.. ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి’’అని సీఎం కోరారు.



Read More
Next Story