
శ్రీనగర్లో భయంతో ఇరుక్కుపోయిన తెలంగాణ పర్యాటకులు
శ్రీనగర్లో జరిగిన పహల్గాం ఉగ్రదాడి నేపధ్యంలో తెలంగాణకు చెందిన వందలాది కుటుంబాలు భయంతో అల్లాడిపోతున్నాయి
శ్రీనగర్లో జరిగిన పహల్గాం ఉగ్రదాడి నేపధ్యంలో తెలంగాణకు చెందిన వందలాది కుటుంబాలు భయంతో అల్లాడిపోతున్నాయి. పహల్గాం ఉగ్రదాడికి తెలంగాణకు ఏమిటి సంబంధం ? సంబంధం ఏమిటంటే తెలంగాణకు చెందిన సుమారు 80 మంది శ్రీనగర్లో(Srinagar)ని హోటళ్ళల్లో చిక్కుకుపోయారు. ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటికాబట్టి దేశం నలుమూలల నుండి ప్రతిరోజు వేలాదిమంది పర్యాటకులు జమ్మూ-కాశ్మీర్ కు వెళుతుంటారు. అలాగే తెలంగాణకు చెందిన 80మంది శ్రీనగర్ కు వెళ్ళారు. పహల్గాంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఉగ్రదాడిలో 28 మంది చనిపోగా పదులసంఖ్యలో బుల్లెట్ గాయాలతో ఆసుప్రతిపాలయ్యారు.
ఎప్పుడైతే ఉగ్రదాడి జరిగిందో వెంటనే భద్రతాదళాలు రంగంలోకి దిగేసి హై అలెర్ట్ ప్రకటించేశారు. దాంతో శ్రీనగర్ అంతా ఒకవిధంగా కర్ఫ్యూ వాతావరణం ఆవరించేసింది. చాలాకాలం తర్వాత ఏకంగా టూరిస్టులనే ఉగ్రవాదులు(Terrorists) టార్గెట్ చేసుకోవటం దేశంలో సంచలనమైంది. ఫలితంగా శ్రీనగర్లో ఉన్న పర్యాటకులు తాము ఎక్కడబసచేశారో అక్కడే ఉండిపోయారు. భద్రతాదళాలు(Armed Forcres) కూడా రోడ్లపై జనాలు ఎవరినీ తిరగనీయటంలేదు ముందుజాగ్రత్తగా. ఏ మూలనుండి ఉగ్రవాదులు మళ్ళీ పర్యాటకులపై దాడిచేస్తారేమో అన్న ఆలోచనతో భద్రతాదళాలు ముందుజాగ్రత్తగా ఎవరినీ బయట తిరగనీయటంలేదు. దాంతో ఉగ్రవాదులు ఎవరిని ఎప్పుడు టార్గెట్ చేస్తారో ? ఏ హోటల్ పై దాడిచేసి మారణహోమం సృష్టిస్తారో అన్న టెన్షన్ పెరిగిపోతోంది.
శ్రీనగర్లోని పహల్గాంలో(Pahalgam Terror Attack) ఉగ్రదాడి జరగటం, 28 మంది మరణించటంతో పాటు పదులసంఖ్యలో తీవ్రంగా గాయపడి ఆసుప్రతిలో చేరటంతో పర్యాటకుల కుటుంబాల్లో టెన్షన్ పెరిగిపోతోంది. అందుబాటులోని సమాచారం ప్రకారం హైదరాబాద్(Hyderabad) కు చెందిన 20 మంది, వరంగల్ నుండి వెళ్ళిన 10 మంది, మహబూబ్ నగర్ కు చెందిన 15 మంది, సంగారెడ్డి 10, మెదక్ పట్టణానికి చెందిన రెండు కుటుంబాలు శ్రీనగర్ లో చిక్కుకుపోయాయి. శ్రీనగర్లో ఉన్న పర్యాటకులతో పాటు వాళ్ళ కుటుంబాల్లో టెన్షన్ పెరిగిపోతోంది. దానికితోడు శ్రీనగర్లోని ఇరుక్కున్న కొందరు విడుదలచేసిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. తాము వివిధ హోటళ్ళల్లో ఉన్నామని, తమలో టెన్షన్ పెరిగిపోతోందని, తమను వెంటనే తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదుకు సురక్షితంగా చేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయటంతో కుటుంబసభ్యులు, ఊర్లలోని బంధు, మిత్రులంతా ప్రభుత్వంపై ఒత్తిడిపెంచేస్తున్నారు.