హైదరాబాద్ కు టెస్లా షోరూమ్ ?
x
Tesla Car

హైదరాబాద్ కు టెస్లా షోరూమ్ ?

దేశవ్యాప్తంగా చాలామంది టెస్లా కార్ల(Tesla) రాకకోసం ఎదురుచూస్తున్నారు.


దేశంలోకి టెస్లా కార్లు అడుగుపెట్టబోతున్నాయన్న వార్త చాలా ఇంట్రెస్టింగుగా ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా చాలామంది టెస్లా కార్ల(Tesla) రాకకోసం ఎదురుచూస్తున్నారు. టెస్లా ఎలక్ట్రిక్ కార్ల(Tesla EV Cars)ను ఇండియాలో అమ్మేందుకు కంపెనీ యజమాని ఎలాన్ మస్క్(Elon Musk) దాదాపు మూడేళ్ళుగా ప్రయత్నిస్తున్నాడు. అయితే అనేక కారణాల వల్ల దేశంలోకి టెస్లా అడుగుపెట్టలేకపోతోంది. అమెరికా(America) అధ్యక్షుడిగా ట్రంప్(Donald J Trump) ప్రమాణస్వీకారానికి నరేంద్రమోడీ(Narendra Modi) హజరయ్యారు. ఆ సమయంలో టెస్లా వ్యవస్ధాపకుడు ఎలాన్ మస్క్-మోడీ మధ్య చర్చలు జరిగాయి. ఆ చర్చల ఫలితమే ఇండియాలోకి టెస్లా కార్ల ఆగమనం.

ఇంతకాలం టెస్లా కార్లు ఇండియాలోకి ఎందుకు రాలేదు ? ఎందుకంటే మనదేశంలోకి ఎలక్ట్రిక్ కర్ల దిగుమతి పన్నులు చాలా ఎక్కువగా ఉండేవి. విదేశాల నుండి ఎలక్ట్రిక్ కార్లను దిగుమతి చేసుకోవాలంటే 110 శాతం పన్నులు కట్టాలి. అలాంటిది విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశ్యంతో కార్ల దిగుమతి పన్నులను 110 శాతం నుండి 70 శాతంకు తగ్గించటానికి మోడీ అంగీకరించారు. టెస్లా కార్లు ఇండియాలోకి అడుగుపెట్టడానికి ఇంతకాలం అడ్డుగా ఉన్న అతిపెద్ద పన్నుల సమస్య పరిష్కారమైంది. దాంతో ఇండియాలోకి కార్లను దిగుమతిచేయటంలో టెస్లా యాజమాన్యం కూడా చాలావేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నది.

ఇందులో భాగంగానే ముందు మెట్రో నగరాల్లో టెస్లా షోరూములను ఏర్పాటుచేయాలని డిసైడ్ అయ్యింది. బహుశా వచ్చే ఏప్రిల్ నెలలో దేశంలోని అనేక నగరాల్లో టెస్లా షోరూములు ఏర్పాటవచ్చని సమాచారం. ముందుగా ముంబాయ్, ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు లాంటి సిటీల్లో షోరూములను ఏర్పాటుచేయటనికి మస్క్ ఆసక్తిగా ఉన్నారు. ఇదేవరసలో హైదరాబాద్ లో కూడా ఒక షోరూమును ఏర్పాటు అవుతుందా లేదా అన్నది సస్పెన్సుగా ఉండిపోయింది. ఇపుడు ఇండియాలోకి రాబోతున్న టెస్లా కార్లన్నింటినీ జర్మనీ నుండే యాజమాన్యం దిగుమతి చేయబోతోంది. దీంతో టెస్లా కార్ల ఉత్పత్తి ఇండియాలో జరగటంలేదన్న విషయం స్పష్టమైంది. పైన చెప్పిన నగరాల్లోనే టెస్లా కార్లు షోరూమ్ కమ్ రీటైల్ ఔట్ లెట్లుగా ఉండబోతున్నాయి. సర్వీసు సెంటర్లను ఎక్కడ ఏర్పాటుచేయబోతున్నామనే విషయాన్ని యాజమాన్యం ఇంకా ప్రకటించలేదు.

కంపెనీ వర్గాల సమాచారం ప్రకారం ఇండియాలో అమ్మే కార్ల ధరలు సుమారు రు. 21 లక్షల నుండి మొదలవుతుంది. ఇండియన్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని బేసిక్ మోడల్ కార్లను ముందు మార్కెట్ చేయాలని ఎలాన్ మస్క్ డిసైడ్ అయ్యారట. టాప్ ఎండ్ మోడల్ కార్ ధర సుమారు 2 కోట్ల రూపాయలుంటుందని అంచనా. ముందు జర్మనీలో అసెంబుల్ చేసిన కార్లను ఇండియాలో అమ్ముతారు. కార్ల అమ్మకాలను బట్టి భవిష్యత్తులో ఉత్పత్తి యూనిట్లగురించి ఆలోచిస్తారు.

Read More
Next Story