ఎప్‌సెట్.. తొలి రోజు ఎన్ని దరఖాస్తుల నమోదయ్యాయంటే..
x

ఎప్‌సెట్.. తొలి రోజు ఎన్ని దరఖాస్తుల నమోదయ్యాయంటే..

ఈ ఏడాది మొత్తం దరాస్తుల సంఖ్య 50 వేల నుంచి 70 వేల వరకు తగ్గే అవకాశం.


తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కసం టీజీ ఎప్‌సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. వీటికి తొలిరోజే 5,010 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. శనివారం ఉదయం 11:45 గంటలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. వీటిలో ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు 3,116, అగ్రికల్చర్ అండ్ ార్మసీ స్ట్రీమ్‌కు 1,891, ఈ రెండు స్ట్రీమ్‌లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముగ్గురు ఉన్నట్లు ఎప్‌సెట్ కన్వీనర్ వెల్లడించారు. టీజీ ఎప్‌సెట్‌కు ఈ ఏడాది నుంచి ఏపీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి వీలు లేదు. దీంతో ఈ ఏడాది మొత్తం దరాస్తుల సంఖ్య 50 వేల నుంచి 70 వేల వరకు తగ్గే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మార్చి 1 నుంచి టీజీ ఎప్‌సెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఇది ఏప్రిల్ 4 వరకు కొనసాగనుంది. ఆ తర్వాత దరఖాస్తు చేసుకోవాలంటే ఏప్రిల్ 9 వరకు రూ.250 ఆలస్య రుసుము చెల్లించాలి. ఆ తర్వాత అయితే ఏప్రిల్ 14 వరకు రూ.500, ఏప్రిల్ 18 వరకు రూ.2500, ఏప్రిల్ 24 వరకు రూ.5000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చు. అదే విధంగా దరఖాస్తులో ఏమైనా తప్పులు ఉంటే వాటిని ఏప్రిల్ 6 నుంచి 8 వరకు సరిచేసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే తమ వివరాలను అందించాల్సి ఉంటుంది.

ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు టీజీ ఎప్‌సెట్ పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 19 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా కోర్సులకు, మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ విభాగాలకు ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు తొలి విడత పరీక్ష జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ పరీక్ష జరగనుంది. ఇంటర్ రెండు సంవత్సరాల్లో 100 శాతం సిలబస్‌తో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.

Read More
Next Story