టీజీపీఎస్సీ కొత్త ఛైర్మన్గా బుర్రా వెంకటేశం..
టీజీపీఎస్సీ ఛైర్మన్గా బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయన ఎవరంటే..
టీజీపీఎస్సీ(TGPSC) ఛైర్మన్గా బుర్రా వెంకటేశం(Burra Venkatesham) నియమితులయ్యారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుత ఛైర్మన్ మహేందర్రెడ్డి పదవీ కాలం డిసెంబర్ 3తో ముగియనున్న క్రమంలో కొత్త ఛైర్మన్గా బుర్రా వెంకటేశంను నియమించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. బుర్రా వెంకటేశం నియామకాన్ని ఖారారు చేస్తూ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మం సంతకం చేశారు. టీజీపీఎస్సీ ఛైర్మన్గా నియమితులైన బుర్రా వెంకటేశం ప్రస్తుతం నిర్వర్తిస్తున్న అన్ని పదవులకు రాజీనామా చేయనున్నారు. ఆయన ఇప్పటికే వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 2త ఆయన టీజీపీఎస్సీ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ విషయంపై ఛైర్మన్ పదవి రావడం చాలా సంతోషంగా ఉందని వెంకటేశం పేర్కొన్నారు.
2014లో ఉమ్మడి ఆంధ్రప్రదెశ్ కాస్తా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్గా విభజించబడింది. ఆ తర్వాత బుర్రా వెంకటేశం.. తెలంగాణ రాష్ట్రానికి కేటాయించబడ్డారు. తెలంగాణలో హోంశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీగా, సమాచార పౌరసంబంధాల కమిషనర్గా ఆయన విధులు నిర్వర్తించారు. 2015లో తెలంగాణ రాష్ట్ర భాష, సంస్కృతి, పర్యాటక శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2017లో డిసెంబర్ 15 నుంచి 19 వరకు అంటే కేవలం ఐదు రోజుల పాటు తెలుగు మహాసభల కోర్ కమిటీ సభ్యుడిగా, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2023 డిసెంబర్ 17న తెలంగాణ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, కాలేజీ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్గా అదనపు బాధ్యతలు అందుకున్నారు. 2024 మార్చి 16న గవర్నర్ తమిళిసై కార్యదర్శిగా బుర్రా అదనపు బాధ్యతలు తీసుకున్నారు.