
గ్రూప్-3 ఫలితాలు వచ్చేశాయి..
పరీక్ష నోటిఫికేషన్ 2022 డిసెంబర్‌లో రిలీజ్ అయినప్పటికీ పరీక్షలు మాత్రం నవంబర్ 2024లో జరిగాయి.
గ్రూప్-3 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. రాత పరీక్షల ఫలితాలను, జనరల్ ర్యాంకింగ్ జాబితాను అధికారులు విడుదల చేశారు. 1365 పోస్టుల భర్తీ కోసం ఈ పరీక్ష జరిగింది. ఈ పరీక్షలకు 5.36 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 50.24శాతం మంది మాత్రమే రాత పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్ష నోటిఫికేషన్ 2022 డిసెంబర్ 30న విడుదలైనప్పటికీ పరీక్ష మాత్రం గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో జరిగాయి. 107 శాఖల పరిధిలో అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సీనియర్ ఆడిటర్ పోస్టులకు రాత పరీక్ష జరిగింది. ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో అత్యధిక పోస్టులు ఉన్నాయి.
Next Story