ఆర్టీసీ సమ్మె వాయిదా
x
TGRTC strike postponed

ఆర్టీసీ సమ్మె వాయిదా

తెలంగాణ ఆర్టీసీ(TGRTC) సమ్మె వాయిదాపడింది


మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాధించింది. ఇంతకీ విషయం ఏమిటంటే తెలంగాణ ఆర్టీసీ(TGRTC) సమ్మె వాయిదాపడింది. మంగళవారం అర్ధరాత్రి నుండి నిరవధిక సమ్మెచేయాలని అనుకున్న ఆర్టీసీలోకి కొన్ని కార్మిక, ఉద్యోగ సంఘాలు తమ నిర్ణయాన్ని వాయిదావేసుకున్నాయి. సమ్మె విషయంలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar), ఉన్నతాధికారులతో జరిగిన చర్చలు సఫలం కావటంతో సమ్మెను వాయిదా వేసుకుంటున్నట్లు ఆర్టీసీ ఉద్యోగ, కార్మిక జేఏసీ నేతలు ప్రకటించారు. తమ సమస్యలపై ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటి వేయటానికి ప్రభుత్వం అంగీకరించినట్లు జేఏసీ నేతలు మీడియాకు చెప్పారు. నవీన్ మిట్టల్, లోకేష్ కుమార్, కృష్ణభాస్కర్ తో కమిటి నియమించినట్లు ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఉద్యోగ, కార్మికుల సంఘాలతో త్రిసభ్య కమిటి చర్చించి ప్రభుత్వానికి వారంరోజుల్లో నివేదిక అందించబోతోంది.

కారుణ్య నియామకాలు చేయాలన్న తమ డిమాండును ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు నేతలు చెప్పారు. అలాగే ఉద్యోగులు, కార్మికులపైన పనిభారం పెరిగిపోతున్న విషయాన్ని కూడా నేతలు మంత్రి దగ్గర ప్రస్తావించారు. కొన్ని సంవత్సరాలుగా పెండింగులో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ వెంటనే రిలీజ్ చేయానే డిమాండుకు కూడా మంత్రి సానుకూలంగా స్పందించారు. ముగ్గురు సభ్యుల కమిటి ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరుపుతుందని, అన్నీ సమస్యలకు, డిమాండ్ల పరిష్కారానికి కమిటి మార్గం చూపిస్తుందని పొన్నం హామీ ఇవ్వటంతో ఆర్టీసీ సమ్మెను వాయిదా వేసుకున్నట్లు జేఏసీ నేతలు ప్రకటించారు.

Read More
Next Story