TGSRTC Electric Buses | హైదరాబాద్‌లో కొత్తగా 353 ఈ-బస్సులు
x

TGSRTC Electric Buses | హైదరాబాద్‌లో కొత్తగా 353 ఈ-బస్సులు

హైదరాబాద్ నగరంలో వచ్చే ఏడాది మార్చి నాటికి కొత్తగా 353 ఎలక్ట్రానిక్ బస్సులు రోడ్లపైకి రానున్నాయి.కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దడానికి ఈ బస్సులు నడపనున్నారు.


తెలంగాణ స్టేట్ ఆర్టీసీ వచ్చే ఏడాది మార్చినాటికి హైదరాబాద్‌లో 353 కొత్త ఈ-బస్సులను ప్రారంభించనుంది.మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తర్వాత బస్సు సర్వీసులను వినియోగించుకునే ప్రయాణికుల సంఖ్య రోజువారీ సగటు 45 లక్షల నుంచి 58 లక్షలకు పెరిగిందని టీజీఎస్‌ఆర్‌టీసీ తెలిపింది.

- కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, నల్గొండ, సూర్యాపేటలలో 446 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రకటించింది.

మహిళలకు 116.13 కోట్ల ఉచిత రైడ్‌లు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది కాలంలో మహాలక్ష్మి పథకం కింద మహిళలు 116.13 కోట్ల ఉచిత రైడ్‌లు పొందారని,దీని ద్వారా కార్పొరేషన్‌కు రూ.3,913.81 కోట్ల ఆదాయం వచ్చిందని టీజీఎస్‌ఆర్‌టీసీ తన ప్రగతి నివేదికలో పేర్కొంది.టీజీఎస్‌ఆర్‌టీసీ బస్సు సర్వీసులను వినియోగించుకునే ప్రయాణికుల సంఖ్య రోజుకు 27 శాతం పెరుగుదలతో రోజుకు సగటున రూ.45 లక్షల నుంచి రూ.58 లక్షలకు ఆదాయం పెరిగింది. బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య 40 శాతం నుంచి 65 శాతానికి పెరిగిందని తెలిపింది.

1389 కొత్త టీజీ ఆర్టీసీ బస్సులు
ఏడాది కాలంలో 1389 కొత్త టీజీ ఆర్టీసీ బస్సులు ప్రారంభించారు.హైదరాబాద్‌-శ్రీశైలం రూట్‌లో 10 రాజధాని ఏసీ బస్సులు, హైదరాబాద్‌లో 75 డీలక్స్‌ బస్సులు, 125 మెట్రో డీలక్స్‌ బస్సులు, హైదరాబాద్‌, కరీంనగర్‌, 251 ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెట్టినట్లు కార్పొరేషన్‌ పేర్కొంది. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మేలో 21 శాతం ఫిట్‌మెంట్‌ను అమలు చేయగా 42,057 మంది ఉద్యోగులు, 11,014 మంది రిటైర్డ్ ఉద్యోగులకు లబ్ధి చేకూరిందని టీజీఆర్టీసీ పేర్కొంది.టీజీఆర్టీసీ ఉద్యోగి మరణిస్తే కోటి రూపాయల బీమా ఇస్తున్నట్లు పేర్కొంది. టీజీఆర్టీసీకి చెందిన 440 మంది ఉద్యోగుల అత్యుత్తమ పనితీరుకు అవార్డులు ప్రదానం చేశారు.

టీజీఆర్టీసీ హాస్పిటల్ అప్ గ్రేడ్
తార్నాకలోని టీజీఆర్టీసీ హాస్పిటల్ ను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌గా అప్‌గ్రేడ్ చేశారు.ఎమ్మారై, సీటీ స్కాన్, ఎమర్జెన్సీ వార్డులు, 24 గంటల ఫార్మసీ, ఫిజియోథెరపీ యూనిట్లు నిర్మించారు.కార్పొరేషన్‌లో ఉద్యోగాలకు సంబంధించి 12 ఏళ్ల తర్వాత ఇటీవల 3,038 పోస్టులు మంజూరుకాగా, ఖాళీగా ఉన్న 557 పోస్టులను కారుణ్య నియామకాల ద్వారా భర్తీ చేశారు.పెద్దపల్లి, ఏటూరునాగారంలో కొత్తగా రెండు బస్ డిపోలను ఏర్పాటు చేశారు. హుస్నాబాద్‌లోని బస్‌స్టేషన్‌ను సుందరీకరించడంతోపాటు జనగాంలోని ఒక డిపోను విస్తరించారు.హైదరాబాద్‌ను కాలుష్య రహిత మహానగరంగా తీర్చిదిద్దడంలో అవసరమైన నియమ నిబంధనలు, విధి విధానాలు తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.


Read More
Next Story