
TGSRTCలో ఖాళీల భర్తీకి సర్కార్ రెడీ..
డ్రైవర్ పోస్ట్‌లు 1000, శ్రామిక్ పోస్ట్‌లు 743 భర్తీ కానున్నాయి.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC)లో డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పోస్టులకు బుధవారం నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఛైర్మన్ వీవీ శ్రీనివాసరావు ప్రకటించారు. ఎస్సీ అభ్యర్థుల వర్గీకరణ గ్రేడ్-1,2,3 ప్రకారం కొత్త ఫార్మాట్‌ో కుల ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాలని ఆయన చెప్పారు. ఒకవేళ కొత్త కుల ధ్రువీకరణ పత్రం అందుబాటులో లేకపోతే తాత్కాలికంగా పాత ధ్రవీకరణ పత్రాన్ని అప్‌లోడ్ చేయాలని, ధ్రువపత్రాల పరిశీలన సమయంలో మాత్రం తప్పనిసరిగా కొత్త ఫార్మాట్‌లోని సర్టిఫికెట్‌నే సమర్పించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు.
ఆర్టీసీలో మొత్తం 1,743 ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. ఇందులో డ్రైవర్ పోస్ట్‌లు 1000, శ్రామిక్ పోస్ట్‌లు 743 ఉన్నాయి. అక్టోబర్ 8 నుంచి 28 వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తుల్ని ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు. గతంలో ఆర్టీసీ ఉద్యోగాల్ని ఆ సంస్థే భర్తీ చేసేది. ఈసారి డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీని పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డుకు అప్పగించారు.
డ్రైవర్ పోస్టులకు అప్లై చేసుకునే వారి వయసు 22-35 ఏళ్ల మధ్య ఉండాలి. శ్రామిక్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారి వయసు 18-30 మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటిరీలకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు మూడేళ్ల వయోపరిమితి సడలింపు ఉంది.